Fish Benefits: ప్రపంచంలో ఈ 5 చేపలలో దాగివున్న ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?. తింటే అద్భుతమైన ప్రయోజనాలు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపలు తినడం వల్ల వివిధ రకాల జబ్బులను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. చేపల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తరచుగా చేపలు తినేవారిలో..

Fish Benefits: ప్రపంచంలో ఈ 5 చేపలలో దాగివున్న ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?. తింటే అద్భుతమైన ప్రయోజనాలు
Fish
Follow us
Subhash Goud

|

Updated on: Jan 29, 2023 | 8:24 PM

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపలు తినడం వల్ల వివిధ రకాల జబ్బులను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. చేపల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తరచుగా చేపలు తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందడమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే వైద్యులు సైతం చేపలు ఎక్కువగా తినాలని చెబుతుంటారు.

  1. సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉత్తమ ఆహారంలో ఇదొకటి. ఈ చేప వల్ల కొవ్వు ఆమ్లం తయారవుతుంది. సాల్మన్‌లో ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు డ్రై ఐ డిసీజ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మెదడు పనితీరుకు ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ బి3 విటమిన్ బి1 విటమిన్ బి12, సెలీనియం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. యాంటీ-డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది.
  2. అల్బాకోర్ ఫిష్: అల్బాకోర్ అనేది ఒక రకమైన ట్యూనా చేప. ఇది అధిక మొత్తంలో ఒమేగా 3 లభిస్తుంది. ఆల్బాకోర్ ట్యూనాను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు, బరువు తగ్గడంలో ఇది చాలా సహాయపడుతుంది. అల్బాకోర్ ట్యూనా మెదడు ఆరోగ్యాన్ని కూడా బాగా ప్రోత్సహిస్తుంది.
  3. మాకేరెల్ ఫిష్: మాకేరెల్ అనేది ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, సెలీనియంతో కూడిన చేప ఇది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, థైరాయిడ్‌ ఉన్నవారికి ఎంతో మంచిదంటున్నారు. మెకెరెల్ ఫిష్ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన మాకేరెల్ ఫిష్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడం, గుండెకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకే మాకేరెల్ చేపలను వారానికి రెండుసార్లు తినమని సిఫార్సు చేస్తుంటారు నిపుణులు. మాకేరెల్ తినడం వల్ల రక్తపోటు నుంచి దూరంగా ఉండవచ్చు.
  4. కాడ్ ఫిష్: కాడ్ ఫిష్ ఒక ప్రసిద్ధ తెల్ల చేప. ఇది చాలా మాంసం, చాలా తక్కువ ఎముకలను కలిగి ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అయితే కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇందులో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డిప్రెషన్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ట్రౌట్ ఫిష్: ట్రౌట్ ఫిష్‌లో ఒకే ఒక ముల్లు ఉంటుంది. ముల్లును తీసివేసిన తర్వాత మీరు చికెన్, మటన్ లాగా ఉడికించాలి.ట్రౌట్ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్-డి ఉంటుంది. కేవలం 150 గ్రాముల వండిన ట్రౌట్ ఫిష్ 1 రోజు విటమిన్ డి అవసరాన్ని తీరుస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి