Heart Attack: చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ఎందుకు వస్తుంది? వాల్వ్ ఎందుకు బ్లాక్ అవుతాయి?

ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. సమయానికి చికిత్స చేస్తేనే సరి లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మారుతున్న..

Heart Attack: చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ఎందుకు వస్తుంది? వాల్వ్  ఎందుకు బ్లాక్ అవుతాయి?
అటువంటి పరిస్థితిలో, మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ఈ అధ్యయనంలో, చాలా మంది యువకుల నిద్ర విధానాలను విశ్లేషించారు.
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2023 | 10:57 AM

ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. సమయానికి చికిత్స చేస్తేనే సరి లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు లక్షణాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అధిక వయసు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో యుక్త వయసులో ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. పాతికేళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే చాలా మంది బాత్‌రూమ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలడం, ఉన్నట్టుండి కూర్చున్న చోటు కుప్పకూలివడం వంటివి చూస్తేనే ఉంటాము. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, జంక్‌ ఫుడ్డుకు దూరంగా ఉంటూ మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు వైద్య నిపుణులు.

చలిగాలులతో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ఎందుకు వస్తుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ధమనిలో అడ్డంకి ఫలితంగా బ్లడ్ ప్లేక్ కారణంగా మెదడు కణాలు అకస్మాత్తుగా కోల్పోవడం లేదా మెదడు కణాలు చనిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సంభవించవచ్చు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది తరచుగా వాతావరణం కారణంగా రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం వల్ల మెదడుకు లేదా గుండెకు రక్త ప్రవాహంలో అంతరాయం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. చల్లని వాతావరణం అధిక బీపీకి దారి తీస్తుంది. హృదయ స్పందనలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఎందుకంటే శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా చలి తీవ్రత పెరిగినప్పుడు గుండెపోటు, స్ట్రోక్‌ వంటి సంభవించే అవకాశాలున్నాయంటున్నారు. గుండె వాల్వ్ బ్లాక్ కారణంగా సమస్య మరింతగా తీవ్రతరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోయి ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్‌ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. న్యూయార్క్‌ మౌంట్ సినాయ్‌ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్‌ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ప్రారంభ లక్షణాలు:

బ్రెయిన్ స్ట్రోక్ ముందస్తు హెచ్చరిక సంకేతాలు లేదా లక్షణాలు మైకము, మాట్లాడేటప్పుడు తడబడటం, దృష్టిలో ఇబ్బంది, సమతుల్యతలో సమస్యలు, ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి లేదా బలహీనత లేదా ఎటువంటి కారణం లేకుండా శీతాకాలంలో తీవ్రమైన తలనొప్పి రావడం వంటి సమస్యలు ఉంటాయి. అలాగే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటం, శ్వాస ఆడకపోవుట, దవడ, మెడ, వీపు, చేయి లేదా భుజంలో నొప్పి, వికారంగా, తేలికగా లేదా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

గుండె సమస్యలను తగ్గించుకోవాలంటే..

శీతాకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వంటివి. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉన్నట్లయితే గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చంటున్నారు. సూర్యరశ్మి కారణంగా శరీరం శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చలికాలంలో ప్రతి రోజు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యల నుంచి గట్టెక్కవచ్చంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?