Health: మధ్యాహ్నం భోజనం చేయగానే కునుకు తీస్తున్నారా.. ఇది లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Jan 28, 2023 | 10:06 PM

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం. మనిషికి తిండి, బట్టలు, ఇల్లు.. ఇలా ప్రాథమిక అవసరాలు ఎలాగో.. నిద్ర కూడా అలాంటిదే. రోజంతా రకరకాల పనులు చేసి, అలిసిపోయే శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండే..

Health: మధ్యాహ్నం భోజనం చేయగానే కునుకు తీస్తున్నారా.. ఇది లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Sleeping Tips

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం. మనిషికి తిండి, బట్టలు, ఇల్లు.. ఇలా ప్రాథమిక అవసరాలు ఎలాగో.. నిద్ర కూడా అలాంటిదే. రోజంతా రకరకాల పనులు చేసి, అలిసిపోయే శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండే ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. పెద్దవాళ్లు తప్పనిసరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయితే.. ప్రస్తుతం మారిపోయిన లైఫ్ స్టైల్ కారణంగా పని విధానాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. షిఫ్టుల విధానంలో పని చేసే పరిస్థితులు తెలెత్తాయి. దీంతో రాత్రి వేళల్లోనూ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా చేసుకుంటూ.. రాత్రి నిద్రపోవడమే గగనమైపోతోంది. ఫలితంగా పని సమయాల్లో కునుకు తీయడం, మత్తుగా అనిపించడం, నీరసం, అలసట.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నే ఉన్నాయి. చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతుంటారు. అయితే.. అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.. కీడు జరుగుతుందా అనే విషయాలపై పరిశోధకులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

మధ్యాహ్నం నిద్ర ప్రయోజనాలు..

జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం 30 నుంచి 90 నిమిషాల మధ్యాహ్న నిద్రలో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇంద్రియ వ్యవస్థకు సున్నితత్వాన్ని తెస్తుంది. భయాందోళన ప్రతిచర్యలను నివారిస్తుంది. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. మానసిక లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శరీరం ఒక చిన్న విరామం కోరుకుంటుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల రిఫ్రెష్‌గా రోజుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కొంత విశ్రాంతి తర్వాత మెదడు రీ ఫ్రెష్ అవుతుంది. శరీరం రీఛార్జ్ అవుతుంది. మరింత శక్తితో పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం నిద్ర నష్టాలు..

రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి వైద్యులు సలహా ఇస్తారు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే మధ్య వయస్కులు, వృద్ధ మహిళలు వరుసగా 39 శాతం, 54 శాతం అధిక రక్తపోటు కలిగి ఉంటారు. ముఖ్యంగా నిద్ర లేమితో బాధపడుతున్నట్లయితే మధ్యాహ్నం నిద్ర అనేది అందరికీ సరిపోదని గమనించాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu