Housefly: ఇలా చేస్తే ఇంట్లోకి ఒక్క ఈగ కూడా రాదు.. అదిరిపోయే టిప్స్ మీకోసం..
వర్షాకాలం వచ్చిందంటే చాటు.. ప్రజలను రోగాలు వెంటాడుతాయి. ఈ రోగాలకు ప్రధాన కారణం వాతావరణ మార్పులు ఒకటైతే.. ఈగలు, దోమలు మరొకటి. వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది తద్వారా ప్రజలు రోగాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో దోమలు, ఈగలు, ఇతర కీటకాల సమస్య ఎక్కువగా ఉంటుంది. మురుగు ప్రాంతాల్లో వాలి వచ్చి ఇంట్లో ఆహార పదార్థాలపై వాలడం కారణంగా..

వర్షాకాలం వచ్చిందంటే చాటు.. ప్రజలను రోగాలు వెంటాడుతాయి. ఈ రోగాలకు ప్రధాన కారణం వాతావరణ మార్పులు ఒకటైతే.. ఈగలు, దోమలు మరొకటి. వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది తద్వారా ప్రజలు రోగాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో దోమలు, ఈగలు, ఇతర కీటకాల సమస్య ఎక్కువగా ఉంటుంది. మురుగు ప్రాంతాల్లో వాలి వచ్చి ఇంట్లో ఆహార పదార్థాలపై వాలడం కారణంగా.. ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, వీటి బెడద నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఈగల, ఇతర కీటకాలను ఇంట్లోంచి తరిమేసేందుకు భారీగా డబ్బులు వెచ్చించి మరీ స్ప్రేలు, ఇతర లిక్విడ్స్, క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ వాటి సమస్య పూర్తిగా తొలగిపోది. ఈ నేపథ్యంలో.. మీరు జేబుకు చిల్లు పడకుండా, ఈగలు, కీటకాల బెడద తొలగిపోయే అద్భుతమైన చిట్కాలను తీసుకువచ్చాం. మరి ఈగలు, ఇతర వ్యాధి కారక కీటకాలు ఇంట్లోంచి తరిమేసే ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..
సాధారణంగా వర్షాకాలంలో ఇళ్లలో ఈగలు, కీటకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లైట్ ఆన్ చేయగానే ఇంట్లో కీటకాలు, పురుగుల బెడద ఎక్కువవుతుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు ఖరీదైన రసాయనాలతో కూడిన స్ప్రేలను కొనుగోలు చేస్తారు. అయితే, వీటికంటే కూడా ఈ ఇంటి నివారణలు అద్భుత ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈగలను, కీటకాలను తరిమేసే హోమ్ రెమిడీస్ ఇవే.
బేకింగ్ సోడా, నిమ్మకాయ స్ప్రే: ఈగలు, కీటకాలను వదిలించుకోవడానికి, బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమాన్ని తయారు చేయవచ్చు. ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి, అందులో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి అన్ని మూలల్లో స్ప్రే చేయండి. అప్పుడు ఇంట్లో ఉన్న ఈగలు, కీటకాలు వెంటనే మాయమైపోతాయి. మళ్లీ తిరిగి రావు.
నల్ల మిరియాలు: నల్ల మిరియాలు స్ప్రే చేయడం ద్వారా కూడా ఈగలు, కీటకాల సమస్యను కూడా వదిలించుకోవచ్చు. ఇందుకోసం నల్ల మిరియాలను మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల మిరియాల పొడిని కలపాలి. ఆ తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో స్ప్రే చేయాలి. తద్వారా ఈగలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
లావెండర్ ఆయిల్: లావెండర్ ఆయిల్ వాసన కారణంగా ఈగలు, కీటకాలు పారిపోతాయి. మాప్ వాటర్‌లో అవసరమైన మేరకు ఈ ఆయిల్‌ను కలిపి అప్లై చేయొచ్చు. ఇంట్లోని కర్టెన్లు, ఇతర ప్రదేశాలకు లావెండర్ నూనెను అప్లై చేయండి. దీనిని ఆయా ప్రాంతాలలో రాయడం వలన ఈగలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
వేప: వేప ఆకుల వాసనను ఈగలు, కీటకాలు తట్టుకోలేవు. రాత్రి సమయంలో కీటకాలు బల్బ్ చుట్టూ వాలుతున్నట్లయితే.. బల్బును ఆన్ చేసే ముందు వేప కొమ్మను ఇక్కడ వేలాడదీయండి. ఇది కాంతి చుట్టూ కీటకాలు సంచరించకుండా నిరోధిస్తుంది. అలాగే, వేప ఆకులను మెత్తగా చేసి నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి ఇంట్లో చల్లుకోవచ్చు.
తులసి మొక్క: ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న తులసి మొక్క ఇంట్లో చీడపీడలు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ఇంటి చుట్టూ లేదా బాల్కనీలో తులసి మొక్కలను నాటవచ్చు. దీంతో ఇంట్లోకి క్రిములు దూరంగా ఉండడంతోపాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








