Horoscope Today: ఆ రాశి వారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి దినఫలాలు
దినఫలాలు (సెప్టెంబర్ 27, 2023): మేష రాశి వారు జీవిత భాగస్వామి మనస్తాపం చెందే విధంగా వ్యవహరించకుండా జాగ్రత్తపడాలి. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం (సెప్టెంబర్ 27, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (సెప్టెంబర్ 27, 2023): మేష రాశి వారు జీవిత భాగస్వామి మనస్తాపం చెందే విధంగా వ్యవహరించకుండా జాగ్రత్తపడాలి. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం (సెప్టెంబర్ 27, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు, కొత్త ఆదాయ మార్గాల గురించి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. వ్యాపారాలు పురోగతి చెందుతాయి. కొద్దిగా కోపతాపాలను అదుపులో పెంచుకుంటే మంచిది. జీవిత భాగస్వామి మనస్తాపం చెందే విధంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం పరవాలేదు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. కొన్ని ఆధ్యాత్మిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మీ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందు కుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహన రుణాలు తప్ప మిగిలిన రుణా లన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందడం జరుగుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా బాధ్యతలు, ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో బాగా తిప్పట ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా ఆశా జనకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సమే తంగా ఆలయాల సందర్శన చేసుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రోజంతా చాలావరకు సానుకూలంగా, సంతోషంగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల్లో కొందరు బాగా సన్నిహితం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విధి నిర్వహణ విషయంలో అధికారులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు కొంత ఆశాభంగం కలిగించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే సూచన లున్నాయి. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపి స్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కాస్తంత ఎక్కువగానే ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిల కడగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తుతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలు విస్తరించడానికి ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొం టారు. స్వల్పంగా అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఇతరులకు చేసిన వాగ్దానాల కారణంగా ఇబ్బంది పడతారు. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకో వడం జరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగి పోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొందరు మిత్రులను కష్టాలలో ఆదుకుం టారు. ఆదాయానికి లోటు ఉండదు కానీ, చేతిలో ఉన్న డబ్బును అతిగా ఖర్చు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కాస్తంత ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.