- Telugu News Photo Gallery Spiritual photos Astrology in Telugu: Saturn impact on your job or Profession prospects
కుంభరాశిలో వక్రించిన శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో మార్పులు, చేర్పులు తప్పవా?
జీవన కారకుడైన శనీశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రించడాన్ని తేలికగా తీసుకోకూడదు. వివిధ రాశులకు ఉద్యోగపరంగా ఎంతో ప్రభావం ఉంటుంది. అందులోనూ ఈ శనీశ్వరుడు శతభిషం నక్షత్రంలో అంటే, మరో వక్ర గ్రహమైన రాహు నక్షత్రంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో అకస్మాత్తుగా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.
Updated on: Sep 27, 2023 | 3:25 PM

Shani Dev

మేషం: ఈ రాశివారికి 11వ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడు తాను స్వయంగా వక్రించడమే కాకుండా, రాహు నక్షత్రమైన శతభిషంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఉద్యోగంలో ఎప్పుడు మార్పు వస్తుందో, అధికారులు, యాజమాన్యాలు ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించడం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా మరింత లాభసాటి ఉద్యోగాల్లోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే, శని వక్రగతి మంచికే కానీ చెడుకు కాదని గ్రహించాలి.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలోనే, అంటే ఉద్యోగ స్థానంలోనే శనీశ్వరుడు వక్రించి ఉన్నందువల్ల హఠాత్తుగా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సొంత ఊర్లో ఉద్యోగం చేస్తున్నవారు, ఉద్యోగంలో స్థిరపడినవారు అనుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. తనకు ఇష్టమైన, తాను నమ్ముకున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక్కోసారి ఉద్యోగంలో తన ప్రాధాన్యం, ప్రాభవం తగ్గిపోయే అవకాశం కూడా ఎదురు కావచ్చు.

కర్కాటకం: ఈ రాశివారి దశమ స్థానాన్ని అంటే ఉద్యోగ స్థానాన్ని శనీశ్వరుడు అష్టమ స్థానం నుంచి వీక్షిం చడం జరుగుతోంది. దీనివల్ల అనుకోకుండా, అకస్మాత్తుగా ఉద్యోగం మారిపోయే అవకాశం ఉంటుంది. తనకు ఏమాత్రం నచ్చని, తన అర్హతలకు ఏమాత్రం సరిపోని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. ఉద్యోగానికి సంబంధించినంత వరకూ ‘అనుకున్నదొకటి, అయింది ఒకటి’ అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగానైనా కష్టనష్టాలు ఎదురు కావచ్చు.

కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో, అంటే సర్వీస్ స్థానంలో శనీశ్వరుడి వక్ర సంచారం ఉద్యోగపరంగా జీవి తాన్ని పెద్ద మలుపు తిప్పుతుంది. ఉద్యోగంలో తనకున్న అనుభవానికి విరుద్ధంగా కొత్త ఉద్యో గంలో చేరడం, తాజాగా అంతా ప్రారంభించడం వంటివి జరిగే సూచనలున్నాయి. ఏ ఉద్యో గంలో ఉన్నా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకా శం ఉంది. నవంబర్ 4న శనీశ్వరుడు వక్రగతి వదిలే వరకూ ఉద్యోగంలో వెట్టి చాకిరీ తప్పక పోవచ్చు.

ధనుస్సు: శనీశ్వరుడు మూడవ రాశి అయిన కుంభంలో ప్రవేశించడంతో ఏలిన్నాటి శని ప్రభావం నుంచి బయటపడిన ఈ రాశివారికి శని వక్రగతి బాగా కలిసి వస్తుంది. అదృష్టం పడుతుంది. ఉద్యోగ పరంగా మంచి యోగం ఇస్తుంది. త్వరితగతిన ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎప్పుడు ఎటువంటి మార్పులు జరిగినా అవి సాను కూలంగానే ఉంటాయి. మరింత లాభసాటి అయిన ఉద్యోగాల్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది.

మకరం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ధన స్థానంలో వక్రించడం వల్ల ఏ ఉద్యోగంలో చేరినా, ఏ స్థాయిలో ఉన్నా స్థిరత్వం ఏర్పడడం, ఆదాయపరంగా కలిసి రావడం జరుగుతుంది. అనుకోకుండా, అకస్మా త్తుగా మంచి ఉద్యోగంలో మారడానికి అవకాశం ఉంది. ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా తప్పకుండా యోగం పడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఇష్టమైన ప్రాంతాలకు లేదా సొంత ఊర్లకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.



