- Telugu News Photo Gallery Spiritual photos Raghavendra swamy matha: Mantralayam temple receives record Rs 4 crore in 34 days as hundi donation
Raghavendra Math: శ్రీశైలంతో పోటీగా మంత్రాలయం హుండీ కలెక్షన్.. అభివృద్ధి, జీతభత్యాలు, అన్నదానానికి ఉపయోగిస్తామని వెల్లడి..
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో ఊహకు అందని విధంగా భారీ ఎత్తున పెరిగింది. వరస సెలవులు, కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సూనాక్ కుటుంబీకులు రావడం వంటి కారణాలతో భారీ ఎత్తున పెరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అష్టాదశ జ్యోతిర్లింగాల్లో, శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయ హుండీతో పోటీగా మంత్రాలయం హండి ఆదాయం పెరగడం పట్ల ఆలయ అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
Updated on: Sep 28, 2023 | 8:02 AM

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మొట్టమొదటి సారిగా రికార్డు స్థాయిలో 34 రోజుల హుండీ ఆదాయం రూ. 3,82,59,839, బంగారు 53 గ్రాములు, వెండి 1200 గ్రాములు కానుకల రూపంలో భక్తులు హుండీలో వేశారు. రికార్డు స్థాయిలో దాదాపు రూ 4 కోట్లు మొట్టమొదటి సారిగా రావడంతో చాలా ఆనందంగా ఉందని శ్రీ మఠం అధికారులు తెలిపారు. వచ్చిన నగదును బ్యాంకులో జమచేసి జీత భత్యాలు, ఉచిత అన్నదానం, భక్తులు సౌకర్యాలు కోసం ఖర్చు చేస్తామని శ్రీ మఠం అధికారులు తెలిపారు.

గతంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. ఇప్పుడు ఏకంగా శ్రీ మఠంకు సంబంధించిన గ్రామ దేవత మాంచాలమ్మను కలుపుకుని వివిధ స్థలాల్లో ఉన్నటువంటి హుండీలలో 4 కోట్ల రూపాయల వచ్చాయి.

4 కోట్ల రూపాయలు రావడానికి వరస సెలవులు కారణమా ? లేక కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమా? బ్రిటన్ ప్రధాని కుటుంబీకులు ఈ హుండీకి కారణమా అనే అంశంపై చర్చించుకుంటున్నారు శ్రీ మఠం అధికారులు, భక్తులు, గ్రామస్తులు.

ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వరస సెలవులు, శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి కానుకల రూపంలో హుండీలో వేయడం వల్ల ఆదాయం పెరిగిందా... లేక13.09.2023 వ తేదీన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తల్లిదండ్రులు, ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తితో కలిసి శ్రీ మఠం హుండీ లో డబ్బులు వేశారా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

గతంలో పూర్వపు పీఠాధిపతులు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు రాలేదు అంటున్నారు భక్తులు, ప్రజలు. ఏది ఏమైనప్పటికి శ్రీ మఠం హుండీ 4 కోట్లు మొట్టమొదటి సారిగా రికార్డు స్థాయిలో రావడంతో మఠం అధికారులు, భక్తులు, ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ 4 కోట్ల రూపాయలను శ్రీ మఠం అభివృద్ధి, జీతభత్యాలు, అన్నదానానికి ఉపయోగిస్తున్నట్లు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం అధికారులు తెలిపారు.




