AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketu Transit: రాశి మారనున్న కేతువు.. ఆ రాశుల వారికి ఆశ్చర్యకర ఫలితాలు పక్కా.. !

ప్రస్తుతం తులా రాశిలో కుజ నక్షత్రమైన చిత్తలో సంచరిస్తున్న కేతువు అక్టోబర్ 24 నుంచి కన్యారాశి ప్రవేశిస్తాడు. చిత్తా నక్షత్రంలో సంచరిస్తున్న కేతువు వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర, కుంభ రాశులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే విధంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టడం జరుగుతుంది. సాధారణంగా కేతువు తన సంచారం చివరి రోజుల్లో కొన్ని రాశులకు యోగం కలిగిస్తాడు.

Ketu Transit: రాశి మారనున్న కేతువు.. ఆ రాశుల వారికి ఆశ్చర్యకర ఫలితాలు పక్కా.. !
Ketu Transit in Virgo 2023
Janardhan Veluru
|

Updated on: Sep 26, 2023 | 7:31 PM

Share

మరో నెల రోజుల్లో రాశి మారుతున్న కేతు గ్రహం కారణంగా ఆరు రాశుల వారికి ఆశ్చర్యకర ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ప్రస్తుతం తులా రాశిలో కుజ నక్షత్రమైన చిత్తలో సంచరిస్తున్న కేతువు అక్టోబర్ 24 నుంచి కన్యారాశి ప్రవేశిస్తాడు. చిత్తా నక్షత్రంలో సంచరిస్తున్న కేతువు వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర, కుంభ రాశులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే విధంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టడం జరుగుతుంది. సాధారణంగా కేతువు తన సంచారం చివరి రోజుల్లో కొన్ని రాశులకు యోగం కలిగిస్తాడు.

  1. వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న కేతువు వల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి ఆశించిన విముక్తి లభిస్తుంది. అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరిగి ప్రధానమైన రుణ బాధల ఒత్తిడి తగ్గిపోతుంది. విమర్శించేవారు, అపనిందలు వేసేవారు, కుట్రలు, కుతంత్రాలు చేసే వారు, ప్రత్యర్థులు, పోటీదార్లు చాలావరకు వెనక్కు తగ్గుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సునాయాసంగా సఫలం అవు తాయి.
  2. మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో సంచరిస్తున్న కేతువు సంతాన యోగం కలిగించడానికి, పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడానికి, పిల్లలు వృద్ధిలోకి రావడానికి అవకాశం కల్పిస్తాడు. కొన్ని వ్యక్తిగత సమస్యలు విచిత్రంగా పరిష్కారం అయిపోతాయి. మీ ఆలోచనలకు, వ్యూహాలకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి మూడవ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా తప్పకుండా ఆర్థిక సంబంధ మైన యోగం పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అతి తక్కువ కాలంలోనే కలిసి వస్తుంది. స్థిరాస్తుల విలువ పెరగడం, తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం, వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు అనూహ్యంగా పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. గతంలో ఏనాడూ లేని విధంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.
  4. ధనుస్సు: ఈ రాశివారికి 11వ స్థానంలో ఉన్న కేతువు అప్రయత్నంగా ధన లాభం తీసుకొస్తాడు. ఆదాయ మార్గాలను పెంచడం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడంతో పాటు ఆధ్యాత్మిక చింతనను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెంచడం, పురోగతినివ్వడం, వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు లేకుండా చేయడం వంటివి చోటు చేసుకుంటాయి. కుటుంబంలో జ్యేష్ట సోదరులకు కూడా మంచి అదృష్టం పడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశివారికి పదవ స్థానంలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొత్త గుర్తింపు వస్తుంది. ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు, యజమానులు ఎక్కువగా ఆధార పడడం జరుగుతుంది. ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవితం అనూహ్యంగా అనేక మలుపులు తిరుగుతుంది.
  7. కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా శుభవార్తలు ఎక్కువగా అందుతుం టాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిపాటి శ్రమతో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.