- Telugu News Photo Gallery Spiritual photos Astro tips astrological remedies for mental peace in telugu
Astro Tips: మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా ఉపశమనం కోసం రోజూ ఈ పనులు చేసి చూడండి..
మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. తినే తిండి, నిద్ర పోయే సమయం, శారీరక శ్రమ సహా అని విషయంలోనూ మార్పులు వచ్చాయి. కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. అయితే కొందరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్ర అనారోగ్య బారిన కూడా పడుతున్నారు.
Updated on: Sep 26, 2023 | 9:56 AM

ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని జ్యోతిష్య పరిహారాలు ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అదే సమయంలో ఈ చర్యలు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. సోమవారం రోజున లేదా వారంలో ఏదొక రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. సమీపంలోని ఆలయాన్ని సందర్శించండి. లేదా ఇంట్లోనే పూజ చేసి తద్వారా రోజును ప్రారంభించండి.

గ్రహాల ప్రభావం నుండి విముక్తి కోసం: జాతకంలోని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి.. ఎవరైనా తరచుగా శివుడిని పూజించాలి. శివలింగానికి నీరు, పాలు సమర్పించాలి. ప్రతిరోజూ 'ఓం నమః శివాయ' లేదా 'ఓం' అని జపించవచ్చు. ఈ మంత్రం మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

చంద్ర బలం కోసం: జాతకం ప్రకారం చంద్ర బలం కోసం రత్నాలను ధరించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు మీరు తప్పనిసరిగా జ్యోతిష్యుని సలహా తీసుకోవాలి. ప్రతిరోజూ చంద్ర యంత్రాన్ని ధరించడం ద్వారా మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూలత ప్రభావాలను మీరు నయం చేసుకోవచ్చు. వెండి గ్లాసులో నీరు త్రాగడం చంద్ర గ్రహం ప్రభావాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

రోజూ చేయాల్సిన పని: ఇంట్లోని పూజ గది దగ్గర ఒక తులసి మొక్కను ఉంచండి. ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన రాహు గ్రహ ప్రభావాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మెదడు, శరీర కండరాలను బలపరుస్తుంది.