- Telugu News Photo Gallery Spiritual photos Vastu for home mandir: follow these vastu tips to remove all obstacles from life here few things to know about temple vastu
Vastu Tips for Puja Room: ఇంట్లో పూజ గది నిర్మాణం.. పూజ చేసే స్థలంలో ఉండాల్సిన వస్తువులకు కూడా కొన్ని నియమాలున్నాయని తెలుసా..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూజగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ఇంట్లో సరైన స్థలంలో సరైన దిశలో పూజ కోసం గదిని నిర్మించడం శుభ ఫలితాలను తెస్తుంది. ఇంటికి ఆనందం, సుఖ శాంతులు లభిస్తాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇంటి ఆలయానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Sep 26, 2023 | 8:46 AM

పూజ గది వాస్తు: ఇంట్లో పూజ కోసం గదిని నిర్మించేటప్పుడు, దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో పూజా స్థలం ఈశాన్య దిశలో లేదా ఈశాన్య మూలలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.

పూజ చేసేటప్పుడు దిశను గుర్తుంచుకోండి: వాస్తు ప్రకారం, సంతోషం, అదృష్టాన్ని పెంచడానికి పూజ చేసేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాభిముఖంగా పూజలు చేయకూడదని నమ్మకం. దీని వల్ల అశుభ ఫలితాలు రావచ్చు.

ఈ ప్రదేశాలలో పూజ గదిని నిర్మించవద్దు: వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం ముందు, మరుగుదొడ్డి దగ్గర, మెట్ల క్రింద ఎప్పుడూ ఆలయాలు నిర్మించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

దేవతామూర్తుల విగ్రహాలు: వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అలాగే ఏ దేవతా విగ్రహం అయినా పెద్దగా ఉండకూడదు. ఆలయంలో 7 అంగుళాల ఎత్తు వరకు విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. విరిగిన విగ్రహాన్ని పూజ గదిలో ఉంచవద్దు.

పూజ చేసుకునే చోట ఉంచాల్సిన వస్తువులు: నెమలి ఈకలు, గంగాజలం, శాలిగ్రామం, శంఖం, గంట, వెండి లేదా ఇత్తడితో చేసిన పూజాఫలకాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ స్థలాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడంతోపాటు పూజ కోసం ఉపయోగించే పాత్రలను కూడా రోజూ శుభ్రం చేయాలి





























