Health Tips: పచ్చి బాదంపప్పు కూడా ఆరోగ్యానికి మంచిదే.. తింటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయంటే..?

Green Almonds: చాలా మంది ఎండిన బాదం పప్పులతోనే మేలు కలుగుతుందని భావిస్తారు. అందుకే వాటినే నానబెట్టుకుని తింటారు. కానీ పచ్చి బాదం పప్పులు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే. పైగా పచ్చి బాదం పప్పును నానబెట్టకుండా నేరుగానే తీసుకోవచ్చు. అసలు పచ్చి బాదంపప్పులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు..

Health Tips: పచ్చి బాదంపప్పు కూడా ఆరోగ్యానికి మంచిదే.. తింటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Green Almonds
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 26, 2023 | 9:33 PM

Green Almonds: డ్రైనట్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విట‌మిన్ ఇ, ఫైబ‌ర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, జింక్, ఫాస్ప‌ర‌స్, మెగ్నిషియం వంటి అనేక రకాల పోషకాలను కలిగిన బాదం పప్పుల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కాదు. అయితే చాలా మంది ఎండిన బాదం పప్పులతోనే మేలు కలుగుతుందని భావిస్తారు. అందుకే వాటినే నానబెట్టుకుని తింటారు. కానీ పచ్చి బాదం పప్పులు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే. పైగా పచ్చి బాదం పప్పును నానబెట్టకుండా నేరుగానే తీసుకోవచ్చు. అసలు పచ్చి బాదంపప్పులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి: పచ్చి బాదంపప్పు తింటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసి, శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి.

గుండె ఆరోగ్యం: పచ్చి బాదం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాక చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి, శరీరానికి మేలు చేస్తాయి.

 జీవక్రియ: పచ్చి బాదంపప్పులను తీసుకుంటే జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి.

ఎముకల బలం: పచ్చి బాదంపప్పులోని ఫాస్ఫరస్, కాల్షియం ఎముకలని బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల సమస్యను దూరం చేసి, ఎముకల సాంద్రతను కూడా పెంచుతాయి.

షుగర్ కంట్రోల్: పచ్చి బాదంపప్పు తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌పై కంట్రోల్ సాధించవచ్చు. తద్వారా మధుమేహం కూడా మీ అదుపులో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!