AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain: వర్షం వల్ల ఇంట్లో గోడలకు తేమ వస్తుందా.? ఇలా చేయండి..

గోడలకు తేమ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది. ఇల్లు నిర్మించే సమయంలో నాణ్యమైన సిమెంట్‌ వాడకపోవడం. బయటకు గోడలకు ప్లాస్ట్రింగ్ సరిగ్గా చేయకపోతే గోడల్లో నుంచి నీరు ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇటుక విషయంలో కూడా నాణ్యత పాటించకపోతే ఇలాగే జరుగుతుంది. నాణ్యత లేని ఇటుకను ఉపయోగించినా కూడా...

Rain: వర్షం వల్ల ఇంట్లో గోడలకు తేమ వస్తుందా.? ఇలా చేయండి..
Rain
Narender Vaitla
|

Updated on: Sep 01, 2024 | 10:49 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తోన్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉంది. ఇక వర్షా కాలం వచ్చిందటంటే చాలు ఇంట్లో పలు సమస్యలు ఎదురువడం సర్వసాధారణం. వర్షాకాలం వచ్చే ప్రధాన సమస్యల్లో గోడలకు తేమ రావడం ఒకటి. అసలు గోడలకు తేమ రావడానికి కారణం ఏంటి.? ఈ సమస్యకు ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

గోడలకు తేమ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది. ఇల్లు నిర్మించే సమయంలో నాణ్యమైన సిమెంట్‌ వాడకపోవడం. బయటకు గోడలకు ప్లాస్ట్రింగ్ సరిగ్గా చేయకపోతే గోడల్లో నుంచి నీరు ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇటుక విషయంలో కూడా నాణ్యత పాటించకపోతే ఇలాగే జరుగుతుంది. నాణ్యత లేని ఇటుకను ఉపయోగించినా కూడా గోడలకు తేమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంటి పై కప్పు నుంచి కూడా నీరు కారడం గమనించే ఉంటాం. మేడపైన నీరు ఎక్కువగా పేరుకు పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీరు ఎక్కువ సమయం పేరుకుపోతే స్లాబ్‌లోకి నీరు ఇంకి నీరు కారడం ప్రారంభమవుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో డ్రైనేజీ పైపుల్లో ఏర్పడే లీక్‌ల కారణంగా కూడా గోడలోకి తేమ వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: Chilli Chicken: చల్లటి వెదర్‌లో హాట్‌హాట్‌ చిల్లీ చికెన్‌.. ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌..

మరి గోడలకు తేమ రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోడలకు ఎక్కడ తేమ వస్తుందో. అవతలి వైపు వాటర్‌ లీక్‌ ప్రూఫ్‌ లిక్విడ్‌లను ఉపయోగించవచ్చు. ఈ లిక్విడ్‌ను సిమెంట్‌లో కలిపి గోడలకు అప్లై చేసుకోవడం వల్ల గోడకు తేమ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మార్కెట్లో వాటర్‌ ప్రూఫ్‌ పెయింట్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటి వల్ల కూడా నీరు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. ఇక గోడలపై ఎక్కడైనా పగుళ్లు వచ్చాయో చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా పగుళ్లు వస్తే వెంటనే వాటిని సిమెంట్‌తో పూడ్చేయాలి. ఇక డ్రైనేజీ పైపులు ఎక్కడైనా లీక్ అవుతున్నాయోమో చెక్‌ చేసుకోవాలి. ఇలా వెంటనే వాటిని సరిచేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా గోడలకు తేమ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..