AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Animals: ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు..! ఈ లిస్ట్​లో ఇంకా ఏమున్నాయంటే?

ఇవి కూడా చాలా పెద్దవిగా ఉంటాయని మీరు అనుకుంటారేమో..! అతి పొరపాటు.. వాస్తవానికి అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అవి మనుసుల ప్రాణాలను అత్యంత సులువుగా తీయగలవు. ఇలాంటి జీవులు కూడా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Dangerous Animals: ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు..! ఈ లిస్ట్​లో ఇంకా ఏమున్నాయంటే?
Most Dangerous Animals
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2024 | 10:00 AM

Share

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులు ఏమిటి? అంటే మనం తరచుగా అడవి సింహాలు, విష సర్పాలు, సొరచేపలు వంటి జంతువులే అనుకుంటాం. నిజం ఏమిటంటే ఈ జీవులను చాలా సినిమాలలో ప్రమాదకరమైనవిగా చూపించారు. దాంతో ఇవి మానవులకు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రజల్లో నిలిచిపోయింది. కానీ, వీటి కంటే మనుషులకు హాని కలిగే ప్రమాదకరమని నిరూపించే కొన్ని జీవులు ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్దవిగా ఉంటాయని మీరు అనుకుంటారేమో..! అతి పొరపాటు.. వాస్తవానికి అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అవి మనుసుల ప్రాణాలను అత్యంత సులువుగా తీయగలవు. ఇలాంటి జీవులు కూడా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దోమ: దోమలు మనుషులకు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఎందుకంటే ప్రమాదకరమైన జీవులలో దోమలు అగ్రస్థానంలో ఉన్నాయి. దోమలు చిన్నవిగా కనిపించినా ప్రాణాంతకమైన వ్యాధులను వ్యాపింపజేస్తాయి. భూమిపై ఉన్న ఏ జీవితో పోల్చినప్పటికీ మనిషి మరణానికి దోమలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, జికా వైరస్, టైఫాయిడ్‌ జ్వరం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. దోమల వల్ల వ్యాపించే వ్యాధులతో ఏటా 7 లక్షల మంది మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

మానవుడు: మీకు ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, మనిషికి మానవుడే అతిపెద్ద ముప్పు. దొంగతనం, దారిదోపిడీ, గొడవలు, హత్య, అఘాయిత్యాలు వంటి నేరాలకు కారణంగా మానవుడే. మనుషులే ఇతర మానవులను క్రూరంగా చంపుతున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ప్రతిరోజూ వార్తల్లో వింటూనే ఉంటాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలలో 4 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

ఇవి కూడా చదవండి

పాము: పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. ఇవి మనుషుల ప్రాణాలను సులువుగా తీస్తాయి. పాము కాటు వల్ల ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా మరణిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. పాములంటే మనుషులు భయపడటానికి కారణం ఇదే. ఇన్లాండ్ తైపాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా వంటి పాము జాతుల విషం చాలా బలంగా ఉంటుంది. ఒక వ్యక్తిని కాటు వేసిన కొన్ని గంటల్లోనే అతను చనిపోవచ్చు. కొండచిలువలు వంటి పాములు 10 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. మనిషిని సులభంగా మింగగలవు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. కొండచిలువలు ఎప్పుడూ మాటువేసి దాడి చేస్తాయి. వాటి రంగు కారణంగా అవంత సులభంగా కనిపించవు.

కుక్కలు: విధేయత విషయంలో కుక్కలకు సమానమైన జీవి లేదు. అందుకే కుక్కలను మానవులకు అత్యంత నమ్మకమైన సహచరులుగా పరిగణిస్తారు. కానీ, కొన్నిసార్లు ఇవి ప్రమాదకరమైనవి కూడా కావచ్చు. కుక్కల లాలాజలంలో రేబిస్ అనే వ్యాధి ఉంటుంది.. ఈ వ్యాధికి చికిత్స చేయకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. కుక్కకాటు వల్ల ఈ వ్యాధి వస్తుంది. కుక్కకాటు కారణంగా ప్రతి సంవత్సరం 59 వేల మంది మరణిస్తున్నారని సమాచారం.

నత్తలు: ఇంత చిన్న నత్తలు కూడా మనుషులను చంపగలవని నమ్ముతారా? అవును నిజమే. కలుషిత నీటిలో కనిపించే ఈ నత్తల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 12 వేల మంది మరణిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. స్కిస్టోసోమియాసిస్ అనే పరాన్నజీవి ఈ నత్తలలో ఉంటుంది. ఇది వాటి లాలాజలం ద్వారా చర్మంలోకి ప్రవేశిస్తుంది.

తేలు: తేళ్లు కూడా అంత తేలికగా తీసుకోలేము. ఇవి కూడా చాలా ప్రమాదకరమైన జీవులు. సర్వేల ప్రకారం తేలు కుట్టడం వల్ల ఏటా దాదాపు 3 వేల మంది చనిపోతున్నారని మీకు తెలుసా? 25 రకాల తేళ్లు ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో కనిపించే తేళ్లు అత్యంత ప్రమాదకరమైనవి.