Watch: పేరుకే మ్యాంగో జ్యూస్.. తాయారు చేసే విధానం చూస్తే.. బిత్తరపోతారు..!
వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్ యూజర్లు విపరీతంగా చూస్తున్నారు. మ్యాంగో జ్యూస్ మొత్తం తయారీ, ప్యాకేజింగ్ తీరును చూసిన తర్వాత వారిలో నిరాశ కట్టలు తెంచుకుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. బాబోయ్ ఇదేం జ్యూస్ తయారీ అంటూ భయాందోళన వ్యక్తం చేశారు.
పండ్లలో రారాజు మామిడి..వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన నోరూరించే మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి. ఇకపోతే, మామిడితో అనేక రకాల వంటకాలు కూడా తయారు చేస్తుంటారు. అంతేకాదు..సీజన్ పూర్తైన తరువాత కూడా మామిడి తాండ్ర, మ్యాంగో జ్యూస్ ఎప్పుడు మామిడి ప్రియులకు అందుబాటులోనే ఉంటుంటాయి. చిన్నా పెద్ద అనే తేడా లేదు..ఈ మ్యాంగ్‌జ్యూస్ అంటే అందరూ ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇది మన దేశంలోనే ఒక బెస్ట్ కూల్‌డ్రింక్‌గా ప్రసిద్ధి. తీపి, పుల్లని రుచితో మ్యాంగ్ జ్యూస్ అందరినీ ఊరిస్తుంటుంది. అంతేకాదు.. మామిడి పండ్ల రసం విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కూడా సమృద్ధిగా లభిస్తాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాంగ్ జ్యూస్ తయారీ వీడియో చూస్తే మాత్రం ఇక మీ జీవితంలో ఈ జ్యూస్ ముట్టుకోరు అనుకుంటా..! పూర్తి వివరాల్లోకి వెళితే…
మ్యాంగ్ జ్యూస్…ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌లతో ప్రముఖుల బ్రాండెడ్ కంపెనీల ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లో ఎన్నో విధాలుగా అమ్ముడవుతున్నాయి. అయితే, నిజంగానే మార్కెట్లో లభించే మ్యాంగో జ్యూస్‌ను మామిడి పండ్ల నుంచే తయారు చేస్తారని మీరు నిజంగా నమ్ముతున్నారా..? ఇన్‌స్టాగ్రామ్‌లోని కంటెంట్ క్రియేటర్ ఒకరు దీనికి సమాదానం ఇచ్చారు.. మ్యాంగో జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుండి రికార్డ్ చేసిన ఒక షాకింగ్ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. కాగా, ఇప్పుడా వీడియో నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
వైరల్ వీడియోలో పసుపు రంగులో ఉండే ఏదో ద్రవ పదార్థాన్ని ఎరుపు, ఆరెంజ్ ఫుడ్ కలరింగ్, షుగర్ సిరప్, ఇతర కెమికల్స్‌తో కలుపుతున్నారు. ఆ తరువాత ప్రాసెస్ చేయబడిన ద్రవాన్ని ప్లాస్టిక్ బక్కెట్లతో ఎత్తుతున్నారు. ఇలా ఎత్తిన ద్రవాన్ని ఆయా సైజులను బట్టి టెట్రా ప్యాకెట్లు, సీసాలు, పెద్ద పెద్ద డబ్బాలలో నింపుతున్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు, పెద్ద పెద్ద యంత్రాలు పనిచేస్తున్నాయి. వారంతా ఇలా తయారైన జ్యూస్‌ని మార్కెట్లోకి డెలివరీ చేయడానికి సిద్ధం చేశారు..చూశారు మనం ఎంతో ఇష్టంగా తాగే మ్యాంగో జ్యూస్ ఎలా తయారైందో..ఇక వీడియోను పోస్ట్ చేస్తూ..దీనికి “టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్” అనే క్యాప్షన్ రాశారు.
View this post on Instagram
వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్ యూజర్లు విపరీతంగా చూస్తున్నారు. మ్యాంగో జ్యూస్ మొత్తం తయారీ, ప్యాకేజింగ్ తీరును చూసిన తర్వాత వారిలో నిరాశ కట్టలు తెంచుకుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. బాబోయ్ ఇదేం జ్యూస్ తయారీ అంటూ భయాందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..