Richest Dog: ఈ కుక్క ఆస్తులు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ఎక్కి తిరిగేందుకు విమానం, బీఎండబ్ల్యూ కారు కూడా..

వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంపంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్‌ రికార్డులకెక్కింది. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. అంతేకాదు..ఈ శునకానికి సేవలు చేసేందుకు గానూ..ఏకంగా 27 మంది సిబ్బంది పనిచేస్తుంటారట. అంతేకాదు..

Richest Dog: ఈ కుక్క ఆస్తులు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ఎక్కి తిరిగేందుకు విమానం, బీఎండబ్ల్యూ కారు కూడా..
German Shepherd
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 30, 2024 | 1:55 PM

ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు..ఇక్కడ కనిపించిన జర్మన్‌ షెఫర్డ్‌ అనే జాతి కుక్క పేరు గుంథెర్‌-6. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదండోయ్..వరల్డ్‌ రిచెస్ట్‌ డాగ్ అట. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు కూడా ఉన్నాయి. ఏంటి షాక్‌ అవుతున్నారా.? కానీ, ఇదంతా నిజమేనండోయ్.. ఒక కుక్కకు ఏకంగా రూ.3,300 కోట్ల ఆస్తి ఉందంటే నమ్మలేరు కానీ, పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోలో కనిపిస్తున్న జర్మన్‌ షెఫర్డ్‌ కుక్కకు రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంపంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్‌ రికార్డులకెక్కింది. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. అంతేకాదు..ఈ శునకానికి సేవలు చేసేందుకు గానూ..ఏకంగా 27 మంది సిబ్బంది పనిచేస్తుంటారట. అంతేకాదు.. దానికి రుచికరమైన ఆహారాలు సిద్ధం చేయడానికి ప్రత్యేకించి ఓ చెఫ్‌ కూడా ఉన్నారంటే మరింత ఆశ్చర్యపోతారు.

కర్లోటా లీబెన్‌స్టీన్‌ కుమారుడు 1992లో మరణించడంతో తన ఆస్తినంతటినీ గుంథెర్‌-3 పేరు మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన ఇటాలియన్‌ స్నేహితుడు మౌరిజియో మియాన్‌కు అప్పగించారు. మియాన్‌ ఈ ఆస్తులను విపరీతంగా పెంచడంతో గుంథెర్‌-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు సంక్రమించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..