వృద్ధుడికి దొరికిన కొండచిలువ పిల్ల.. ముద్దుగా ఉందని పెంచుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే?
కూరగాయలు అమ్ముకునే 60ఏళ్ల వృద్ధుడు కొండచిలువ దాడిలో మృతిచెందాడు. ఈ సంఘటన అనంతరం కొండచిలువ అదే ప్రాంతంలో అక్కడక్కడ తిరగడం కనిపించింది. పోలీసులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించటంతో అతను కొండచిలువను బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో హృదయ విదారకమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కూరగాయలు అమ్ముకునే 60ఏళ్ల వృద్ధుడు కొండచిలువ దాడిలో మృతిచెందాడు. స్థానికంగా కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి ఒకరోజు చిన్ని కొండచిలువ పాము కనిపించింది. దాంతో అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవటం మొదలుపెట్టాడు. అతడు తరచూ ఆ కొండచిలువను మెడకు చుట్టుకుని ఆడించేవాడు. చుట్టుపక్కల ప్రజలు ఇదంతా చూసి ఆనందపడేవారు. ఒకింత ఆశ్చర్యపోయేవారు. అంతేకాదు.. అతనికి డబ్బులు కూడా ఇచ్చేవారు. దీంతో అతను కూడా పామును ఆడిస్తూ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే ఒకరోజు పామును ఆడిస్తుండగా, అది అతని మెడను గట్టిగా చుట్టేసింది. అతను నొప్పి, బాధతో అల్లాడిపోయాడు. చివరకు ఆ కొండచిలువ అతని గొంతును గట్టిగా చుట్టుకుని నులిమేసింది. దాంతో ఆ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు.
ఈ విషాద సంఘటన ఆగస్టు 29 గురువారం రోజున జరిగింది. పామును ఆడిస్తూ.. డబ్బు సంపాదించవచ్చని భావించిన అతను.. రోడ్డుపై దొరికిన కొండచిలువ పిల్లను తన వెంట తెచ్చుకున్న పాపానికి అదే అతని మరణానికి కారణమైంది. ఈ విషాద ఘటన వార్త విన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవించే 60 ఏళ్ల వృద్ధుడు కొండచిలువను పెంచుకున్నాడు. చివరకు దానికే బలైపోవడంతో స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. జరిగిన ఘటనపై స్థానికులే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మామిడి ప్రాంతంలోని దిమ్నా రోడ్డులో నివసిస్తున్న మృతుడు హేమంత్ సింగ్ అని చెప్పారు.. ఈ సంఘటన అనంతరం కొండచిలువ అదే ప్రాంతంలో అక్కడక్కడ తిరగడం కనిపించింది. పోలీసులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించటంతో అతను కొండచిలువను బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు హేమంత్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు మామిడి పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి నిరంజన్‌కుమార్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..