AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python attack: పాములతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరీ..! కేర్ టేకర్ మీద అమాంతం దాడి చేసిన కొండ చిలువ..

పాముకు నిలువెల్లా విషమే అంటారు.. అంతేకాదు..పాముకు పాలు పోసి పెంచినా అది విషయాన్ని మాత్రమే చిమ్ముతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణగానే ఇక్కడో వీడియో వైరల్‌గా మారింది. రోజూ తిండి పెడుతున్న వ్యక్తిపైనే ఇక్కడో పాము దాడి చేసింది. అది ఒక్కసారిగా తన కేర్ టేకర్ మీదనే దాడికి తెగబడింది.

Python attack: పాములతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరీ..! కేర్ టేకర్ మీద అమాంతం దాడి చేసిన కొండ చిలువ..
Python Attack
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2024 | 10:25 AM

Share

చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. కొంత మందికైతే పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అంత దూరంలో పాము ఉందని తెలిస్తే చాలు.. ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. ఇకపోతే, సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వెరైటీ వీడియోలు తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఏదేమైనప్పటికీ పాముల వెరైటీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు మాత్రం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో జంతు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఒక భారీ కొండచిలువ వీడియో ఒకటి నెట్టింట కలకలం సృష్టించింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పాముల నైజాన్ని వివరిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి పెద్ద సంఖ్యలో ఉన్న పాములు, కొండ చిలువల్ని ఒక గదిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పెట్టెలలో పెడుతూ.. వాటిని సంరక్షిస్తున్నాడు. అతనికి ఇలాంటి పాములు, కొండ చిలువలను పెంచుకోవడం అంటే ఇష్టమని తెలిసింది. అందుకే వాటి కోసం తన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశాడు. అక్కడ రకరకాల పాములు, కొండ చిలువలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడు ఒక భారీ కొండచిలువను పెట్టేలో నుంచి బైటకు తీసి దాని గురించి వివరిస్తూ వీడియో రికార్డ్‌ చేస్తున్నాడు.. ఇంతలో కొండ చిలువ రెచ్చిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే వణికిపోతారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఆ వ్యక్తి చూపిస్తున్న కొండ చిలువ సైజు చూస్తేనే భయంకరంగా ఉంది. ఇకపోతే, దాని చుట్టూ చాలా గుడ్లు కూడా ఉన్నాయి. అతను పాము గురించి మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా పాము అతని ముఖంపై దాడి చేసింది. ఒక్కసారిగా తన కేర్ టేకర్ మీదనే దాడికి తెగబడింది. సెకన్ల వ్యవధిలో కొండ చిలువ దాడికి ప్రయత్నించింది. వెంటనే అతను కూడా సమయస్పూర్తిగా వ్యవహారించి దాని కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోను షేర్ చేసిన జేబ్రూవర్ అనే వ్యక్తికి పాములంటే మహా ఇష్టమట. అతను ఇలాంటి అనేక పాములను రక్షించి, సంరక్షిస్తుండట. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. తినిపించినా, సంరక్షించినా పాములు దాడి చేస్తాయని అంటున్నారు. అందుకే మన పెద్దలు అంటారు.. పాముకు పాలు పోసి పెంచినా అది విషయాన్ని మాత్రమే చిమ్ముతుందని. ఈ నానుడిని గుర్తు చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు.