ఉదయాన్నే ఇంటి తలుపు తీయగా గుమ్మం ముందు భారీ ఆకారం.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన గుజరాత్‌ను వరుస తుఫానులు వెంటాడుతున్నాయి. ఆగస్టు 30న కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర,కచ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 300 మొసళ్లకు ఆవాసమైన విశ్వామిత్ర నదికి వరద పోటెత్తుతోంది.
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు. వర్షాలు, వరదలతో అతలాకుతలమైన గుజరాత్‌ను వరుస తుఫానులు వెంటాడుతున్నాయి. ఆగస్టు 30న కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర,కచ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జామ్‌నగర్, పోర్‌బందర్,మోర్బీ,స్వర్కా,కచ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు రామాశ్రయ్ యాదవ్ తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం భూపేంద్ర పటేల్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఈ వీడియో చూడండి..
After heavy rain in #Vadodara‘s Kamanath Nagar, a 15-foot crocodile was rescued by the forest department. The crocodile, which had entered a house in Kamanath Nagar, was found in the water.@NewIndianXpress @santwana99 @Shahid_Faridi_ @TheMornStandard pic.twitter.com/KWHLmWDlQZ
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) August 29, 2024
ఇదిలా ఉండగా, గురువారం ఫతేగంజ్ సమీపంలోని కామ్‌నాథ్ నగర్‌లోని ఓ ఇంటి గుమ్మం వద్ద 15 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. భారీ వర్షాల కారణంగా విశ్వామిత్ర నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని వరద ముంచేత్తింది. నీటి ప్రవహనికి ఈ మొసలి కొట్టుకుపోయి నివాస ప్రాంతాలకు చేరుకుంది. మొసలిని చూసిన స్థానిక ప్రజలు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. వాలంటీర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మొసలి జాగ్రత్తగా బంధించి పట్టుకున్నారు. సుమారు గంటపాటు శ్రమించిన అటవీశాఖ మొసలిని సురక్షితంగా బంధించారు. ఇప్పుడు ఆ మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనే బుధవారం అర్థరాత్రి, సామా ప్రాంతంలో వరద నీటిలో ఈదుకుంటూ 11 అడుగుల పొడవున్న మరో మొసలి కనిపించింది. తరువాత దానిని కూడా సిబ్బంది రక్షించారు.
ఈ వీడియో చూడండి..
મગર જ મગર વડોદરામાં #Vadodara pic.twitter.com/7N4Y8gUQgv
— Janak sutariya (@Janak_Sutariyaa) August 29, 2024
గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 300 మొసళ్లకు ఆవాసమైన విశ్వామిత్ర నదికి వరద పోటెత్తుతోంది. నదీ జలాలు ఉప్పొంగి నగరంలోకి రావడంతో అనేక మొసళ్లు నివాస ప్రాంతాలకు చేరాయి. అకాల వర్షాలు, వాతావరణ మార్పులు మనుషులకు, జంతువులకు ఎంత ముప్పు తెస్తాయో చెప్పడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..