Viral Video: పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చిన ఖాకీలు..అంతలోనే వచ్చిన ఆఫీసర్..! అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు..
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆనందించే హక్కు ఉంది. ఇది రాజ్యాంగంలోనే ఉందని ఒకరు రాయగా, వీరికి రూ. 5 వేల చలాన్ విధించాలంటూ డిమాండ్ చేశారు. మరొకరు వీరంతా నకిలీ పోలీసుల అసలు పనితీరును ఇదేనంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
వైరల్ వీడియోలో ఓ కానిస్టేబుల్, మహిళా పోలీసు అధికారిణి కలిసి ప్రాంతీయ భాషా హిట్ సాంగ్‌కి జోరుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వారికి నచ్చిన పాట ప్లే చేస్తుండగా.. వీరిద్దరూ డ్యాన్స్‌లో మునిగితేలారు.. ఇదంతా పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నామనే విషయం కూడా వారు మరిచిపోయారు. ఇద్దరూ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లో బిజీగా ఉండగా, ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి చేరుకున్నాడు.. అంతలోనే మహిళా పోలీస్ ఆఫీసర్ అతన్ని ఆఫీసర్‌ని చూస్తుంది. కాని, రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్ మాత్రం స్పృహ కోల్పోయినట్టుగా డ్యాన్స్‌లో మునిగిపోయాడు. అప్పటికీ సదరు లేడీ కానిస్టేబుల్ అతన్ని సైగల ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఆఫీసర్‌ని చూసిన కానిస్టేబుల్ కూడా కంగుతిన్నాడు.. వెంటనే ఇద్దరూ డ్యాన్స్ ఆపేసి ఆఫీసర్‌కి సెల్యూట్ చేసి సారీ చెప్పేందుకు రెడీ అయ్యారు. కానీ, ఆ ఆఫీసర్ ఏం చేశాడో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..! వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
భలేగా ఆఫీసర్ కదా..! పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సీరియస్‌గా వచ్చిన ఆఫీసర్ కూడా వారితో కలిసి సరదాగా స్టెప్పులేశాడు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడోనని భయపడిపోయిన లేడి కానిస్టేబుల్ సహా ఇద్దరు కూడా ఆఫీసర్‌తో కలిసి కాలుకదిపారు. ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆనందించే హక్కు ఉంది. ఇది రాజ్యాంగంలోనే ఉందని ఒకరు రాయగా, మరొకరు స్పందిస్తూ..ఎలాంటి ఒత్తిడి లేకుండా పోలీసులు సంతోషంగా డ్యాన్స్‌లు చేయటం నేను మొదటిసారి చూస్తున్నాను..వీరికి చప్పట్లు కొట్టండి అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యనించారు. ఇదిలా ఉంటే, వీరికి రూ. 5 వేల చలాన్ విధించాలంటూ డిమాండ్ చేశారు. మరొకరు వీరంతా నకిలీ పోలీసుల అసలు పనితీరును ఇదేనంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి