AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..

కొత్తింటి నిర్మాణం చేపట్టాలనే ఆలోచన రాగానే ప్రతీ ఒక్కరూ ముందుగా చేసే పని వాస్తు పండితులను సంప్రదించడం. వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకోసమే వాస్తు పండితుల సూచనలు తీసుకుంటుంటారు. అయితే కొత్తింటి నిర్మాణం చేపట్టినా లేదా అప్పటికే నిర్మాణం చేసిన ఇంటిని కొనుగొలు చేయాలనుకుంటున్నా...

Vastu Tips: కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Sep 01, 2024 | 11:17 AM

Share

కొత్తింటి నిర్మాణం చేపట్టాలనే ఆలోచన రాగానే ప్రతీ ఒక్కరూ ముందుగా చేసే పని వాస్తు పండితులను సంప్రదించడం. వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకోసమే వాస్తు పండితుల సూచనలు తీసుకుంటుంటారు. అయితే కొత్తింటి నిర్మాణం చేపట్టినా లేదా అప్పటికే నిర్మాణం చేసిన ఇంటిని కొనుగొలు చేయాలనుకుంటున్నా. కొన్న ప్రాథమిక వాస్తు నియమాలను చూసుకోవాలని చెబుతున్నారు. వాస్తు పండితుల సూచనలు తీసుకునే కంటే ముందగానే కొన్ని బేసిక్‌ వాస్తు నియమాలపై అవగాహన ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఇంటి విషయంలో పాటించాల్సి కొన్ని బేసిక్‌ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటి విషయంలో తప్పకుండా చూసుకోవాల్సిన అంశాల్లో ఇంటి ప్రధాన ద్వారం ఒకటి. ఇంటికి ప్రధాన ద్వారం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే సూర్య కిరణాలు ఇంట్లోకి వచ్చేలా ఉండడం సరైన వాస్తుకు సంకేతమని అంటున్నారు.

* ఇక ఇంటి వాస్తు విషయంలో పాటించాల్సిన మరో ప్రాథమిక అంశం. పూజ గది. పూజ గది ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంటే దేవుడి ముఖం తూర్పు వైపు ఉండాలన్నమాట.

* బేసిక్‌ వాస్తు నియమాల్లో వంటగది దిశ కూడా ఒకటి. కిచెన్‌ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దిశలోనే ఉండేలా చూసుకోవాలి. ఆగ్నేయ దిశ అగ్నికి సంకేతంగా చెబుతారు. అందుకే ఈ దిశలోనే కిచెన్‌ ఉండాలి.

* ఇక ఇంట్లో కచ్చితంగా ఉండే బోర్‌ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీటి సంపులు కూడా ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి.

* బాత్‌రూమ్‌ విషయానికొస్తే.. కచ్చితంగా ఉత్తరం లేదా వాయివ్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇదే వాస్తుకు సరైన దిశ అని పండితులు చెబుతున్నారు.

* ఇంట్లో మరో ప్రధాన అంశం మెట్లు. మెట్లు ఎట్టి పరిస్థితుల్లో పడమర లేదా దక్షిణ దిశలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉండకూడదు. మెట్ల కింద బాత్‌ రూమ్‌ ఉండకూడదని వాస్తు చెబుతోంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు