Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kite Flying: సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది..

ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు నెల, రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగురవేస్తుంటారు. రకరకాల గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంలో..

Kite Flying: సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది..
Flying Kites
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2023 | 4:50 PM

ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు నెల, రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగురవేస్తుంటారు. రకరకాల గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంలో మునిగిపోతుంటారు. అయితే సంక్రాంతికి మాత్రం ఆకాశంలో ఎటు చూసినా గాలిపటాలే కనిపిస్తుంటాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టణాల్లో అయితే బిల్డింగ్‌లపై, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఊరి పక్కన ఉండే పొలాల్లో ఎగురవేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే గాలి పటాలు ఎగురవేయడం ఈనాటిది కాదు. చరిత్రను పరిశీలిస్తే.. దాదాపు 2 వేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారని తెలుస్తోంది.

మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్‌, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు.

సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో..

దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు హేన్‌ చక్రవర్తి వచ్చిన ఐడియానే తొలి గాలిపటం. అయితే ఆ రాజు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది ఆలోచన. కానీ ఎంత దూరం తవ్వాలన్న విషయం ఆలోచించి హేన్‌ చక్రవర్తి ఒకదానిని గాలిపటంలా చేసి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచే సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యానికి..

మకర సంక్రాంతి రోజున అందరూ తెల్లవారుజామున లేచి సూర్యుని ఎండలో నిలబడి గాలిపటాలను ఎగరవేస్తారు. ఆ సమయంలో సూర్య కిరణాలు ఆరోగ్యకరమైనవిగా చెబుతారు. ఉదయం పూట సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. అది చర్మానికి చాలా మంచిది. చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయపడుతుంది.

ఆయుర్వేద శాస్త్రంలో ఏముంది..?

ఈగాలి పటాలు ఎగురవేయడం వెనుక చాలా ఆశక్తికరమైన కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను పగలే ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది. దీంతో ఆరోగ్య రీత్యా ఇది చాల మంచి అలవాటు అనీ ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.

వివిధ దేశాల్లో..

  • థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
  • బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు.
  • ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు.
  • జపాన్‌లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందట.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి