AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Recognition: ఐరిస్ స్కాన్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా.. అందుబాటులోకి రానున్న కొత్త సదుపాయం

దేశంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఎంతో టెక్నాలజీతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏ చిన్న పనికి కూడా..

Face Recognition: ఐరిస్ స్కాన్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా.. అందుబాటులోకి రానున్న కొత్త సదుపాయం
Iris Scan
Subhash Goud
|

Updated on: Jan 14, 2023 | 2:26 PM

Share

దేశంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఎంతో టెక్నాలజీతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏ చిన్న పనికి కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం సాంకేతికత కారణంగా ఎన్నో సదుపాయాలు ఇంట్లోనే ఉండి మొబైల్‌ ద్వారా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఏటీఎం విషయంలో కూడా పలు సదుపాయాలు అందుబాటులోకి రాగా, మరో సర్వీసు అందుబాటులోకి రానుంద. ఇక రానున్న రోజుల్లో ‘కళ్లు’ చూపించి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే సదుపాయం రాబోతోంది. ఇది ఐరిస్‌ స్కార్‌ ద్వారా సులభతరం అవుతుంది. బ్యాంకులు త్వరలో కొన్ని లావాదేవీలలో ఐరిస్ స్కాన్ లేదా ఫేస్ రికగ్నిషన్‌తో ఖాతాదారుడు డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఖాతాదారుని ధృవీకరించకపోతే. బ్యాంకు లావాదేవీలు జరపదు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సౌకర్యాన్ని దేశంలోని కొన్ని పెద్ద బ్యాంకులు కూడా ప్రారంభించాయి. అయితే ఆ బ్యాంకుల పేర్లు నివేదికలో లేవు.

బ్యాంకు మోసం, పన్ను ఎగవేతలను నిరోధించడానికి, తగ్గించడానికి, భారత ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను ముఖ గుర్తింపు, ఐరిస్ స్కాన్‌ని ఉపయోగించాలని కోరింది. వ్యక్తిగత లావాదేవీల వార్షిక పరిమితి ముగిసిన తర్వాత లావాదేవీల కోసం ముఖ గుర్తింపు, ఐరిస్ స్కాన్‌లను ఉపయోగించవచ్చు. ఈ సర్వీసును కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రారంభించనున్నాయి. రిఫికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఐరిస్ స్కాన్ ఉపయోగించడం తప్పనిసరి కాదు,. అయితే పన్ను ప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నంబర్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను బ్యాంకులతో పంచుకోని సందర్భాల్లో ఇది ఖచ్చితంగా ఉపయోగించబడుతోంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల (USD 24,478.61) కంటే ఎక్కువ డిపాజిట్లు, ఉపసంహరణలను ధృవీకరించడానికి కంటి స్కాన్లు, ముఖ గుర్తింపును ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డ్‌లో ఒక వ్యక్తి వేలిముద్రలు, ముఖం, కంటి స్కాన్‌లకు అనుసంధానించబడిన ప్రత్యేక సంఖ్య ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ:

UIDAI సమస్యపై అవసరమైన చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులను కోరింది. లావాదేవీ చేసే ముందు వ్యక్తిని ఫేస్ రికగ్నిషన్ ఫేస్, ఐరిస్ స్కాన్ ద్వారా వెరిఫికేషన్ చేయాలని ఈ లేఖలో సూచించారు. ఒక వ్యక్తి వేలిముద్ర ధృవీకరణ విఫలమైన సందర్భాల్లో ఇది మరింత ముఖ్యమైనది. ఈ విషయంపై యూఐడీఏఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి