Priti Adani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ఆదానీ భార్య ప్రీతి గురించి ఎవ్వరికి తెలియని విషయాలు
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో ఇండియాకు చెందిన గౌతమ్ ఆదాని ఒకరు. ఈయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్..
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో ఇండియాకు చెందిన గౌతమ్ ఆదాని ఒకరు. ఈయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ ఆదానీ నికర విలువ 131.3 బిలియన్ డాలర్లు. అయితే ఆదానీ భార్య ప్రీతి ఆదానీ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రీతి ముంబైలో పుట్టి అహ్మదాబాద్‌లో పెరిగారు. కొద్దికాలం పాటు తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. గౌతమ్‌తో ఆమె వివాహం కుటుంబ పెద్దలు కుదిరించిన పెళ్లి.
ఆదానీ భార్య ప్రీతి ఆదానీ ఓ డెంటిస్ట్. ఆమెకు సాధారణ జీవనశైలి అంటేనే ఎక్కువ ఇష్టమట. ప్రతీ ఆదానీ విద్యావేత్త. ఆమె ఆదానీ గ్రూప్‌నకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్‌గా ఉన్నారు.
సాదా రంగు కాటన్ చీరలంటే ఎక్కువ ఇష్టమట:
ప్రతీ ఆదానీకి సాధారణ రంగు కలిగిన కాటన్ చీరలు అంటే ఎక్కువ ఇష్టమట. పబ్లిక్‌లో లైట్ సల్వార్ కమీజ్‌లో ఎక్కువగా కనిపిస్తారు. ప్రతీ ఆదానీ ప్లాటీనం, వజ్రాలకంటే ముత్యాలను ఎక్కువగా ఇష్టపడతారట. ముత్యాలతో కూడిన అభరణాలు ధరించడమే ఇష్టమట.
ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, వాచీలపై పెద్దగా ఆసక్తి ఉండదు:
ప్రతీ ఆదానీ పెద్ద వ్యాపారవేత్త భార్య అయినప్పటికీ ఖరీదైన వాచ్‌లు, బ్యాగులు, షూలపై పెద్దగా ఆసక్తి చూపరట. ఆమె ఎప్పుడు కూడా నార్మల్‌గా ఉండేందుకు ఇష్టపడతారట. ఆమె ఎక్కువగా లెదర్ స్ట్రాప్ వాచీలు ధరిస్తుంటారు. కానీ ఆమె తన కెరీర్‌ను ప్రారంభించకముందే ఆమె వివాహం తర్వాత 1996లో సుస్థిర అభివృద్ధి, గౌతమ్ ఆదానీ లాభాపేక్షలేని సంస్థ అయిన అదానీ ఫౌండేషన్‌కు ఆమె మొదటి, ఏకైక ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 2001లో గుజరాత్ భూకంపం కారణంగా 20,000 మంది ప్రాణాలు కోల్పోగా, 150,000 మందికి పైగా గాయపడ్డారు. విషాదంపై త్వరగా స్పందించిన ప్రీతి, సమాజంలోని పిల్లలకు విద్యను అందించడానికి ముంద్రాలో అదానీ DAV పబ్లిక్ స్కూల్‌ను స్థాపించడానికి ముందుకొచ్చింది.
ఆదానీ ఫౌండేషన్‌కు చైర్మన్ బాధ్యతలు:
ప్రతీ ఆదానీ మంచి వ్యాపారవేత్త. 2018-19లో ఆదానీ నాయకత్వంలో డివిజన్ లాభం రూ.95 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెరిగింది. ఆమె ఆదానీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే గౌతమ్ ఆదానీ ఏ సంపన్న కుటుంబం నుంచి రాలేదు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగి ఆదానీ గ్రూప్‌ను స్థాపించారు. అహ్మదాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గౌతమ్ పాఠశాల విద్య తర్వాత కామర్స్ డిగ్రీలో చేరారు. కానీ కొన్ని కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..