PM Kisan Refund: ఇలాంటి రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా? చిక్కుల్లో పడినట్లే.. వాయిదాలు వెనక్కి ఇవ్వాల్సిందే

కేంద్రం ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇక రైతులకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని..

PM Kisan Refund: ఇలాంటి రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నారా? చిక్కుల్లో పడినట్లే.. వాయిదాలు వెనక్కి ఇవ్వాల్సిందే
మీ ఆధార్ నంబర్, ఖాతా నంబర్ తప్పుగా ఉంటే, దాన్ని సరిచేయవచ్చు. మీ ఖాతాలో రూ. 2000 జమకాకపోతే ఇక్కడ సంప్రదించండి
Follow us

|

Updated on: Jan 10, 2023 | 7:28 PM

కేంద్రం ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇక రైతులకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ స్కీమ్‌ కింద ప్రతి ఏడాది రైతుకు రూ.6000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. విడతకు రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే ఈ పథకాన్ని అర్హులైన వారే కాకుండా అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. అనర్హుల జాబితాను బయటకు తీస్తోంది. అనర్హులుగా ఉన్న రైతుల నుంచి పీఎం కిసాన్‌ డబ్బులను రికవరీ చేస్తోంది. మరి మీరు కూడా అనర్హులుగా ఉన్నట్లయితే ఇప్పటి వరకు పొందిన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే. లేకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చాలా మార్పులు చేసింది కేంద్రం.

మీరు కూడా ఈ పథకం కింద మీ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయకుంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ పథకంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం కొత్త నియమం ప్రకారం.. మీ పత్రాలు అప్‌డేట్‌ చేసుకోకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. లేకపోతే నకిలీ జాబితాలో ఉండిపోతారు. అప్పటి వరకు తీసుకున్న అన్ని వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అనర్హులుగా ఉన్నవారు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతులు 12వ విడత డబ్బులు అందుకున్నారు. ఇప్పుడు 13వ విడత అందుకోవాల్సి ఉంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం నకిలీ రైతులపై కఠిన చర్యలు ప్రారంభించి నోటీసులు కూడా పంపుతోంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకం పొందుతున్నవారు ఉన్నారు. అలాంటి వారిపై కూడా కూడా దృష్టి సారిస్తోంది. కేంద్రం. ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నట్లయితే అందుకు అనర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం లభిస్తుందని గుర్తించుకోవాలి. ఇక అనర్హులు ఈ పథకం ప్రయోజనం పొందినట్లయితే వెంటనే ఆ డబ్బులను వాపస్‌ చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులను రిటన్‌ చేయవచ్చు. మీరే స్వచ్చంధంగా డబ్బులు వాపస్‌ చేసినట్లయితే మీపై ఎలాంటి చర్యలు ఉండవు. లేకపోతే చర్యలతో పాటు డబ్బులు వాపసు చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే పీఎం కిసాన్ యోజన ప్రారంభంలో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పరిగణించారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసింది. తద్వారా దేశంలోని 14.5 కోట్ల మంది రైతులకుపైదా ఈ ప్రయోజనం పొందనున్నారు. అలాగే ఆధార్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్న రైతులకు కేవైసీ తప్పనిసరి. ఇప్పటి వరకు ఈ పని పూర్తి చేయకుంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. లేకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో