EPFO: మీ పీఎఫ్ UAN నంబర్ మర్చిపోయారా..? టెన్షన్ పడకండి.. ఇలా సులభంగా తెలుసుకోండి
ఉద్యో గులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతా ఎంతో ముఖ్యం. ఉద్యో గి జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తం కట్ అవుతూ పీఎప్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈపీఎఫ్‌లో..
ఉద్యో గులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతా ఎంతో ముఖ్యం. ఉద్యో గి జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తం కట్ అవుతూ పీఎప్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈపీఎఫ్‌లో ఖాతాదారులకు యూఏఎన్ నంబర్ ఎంతో కీలకమైనది. దీనిని లాగిన్ కావడం వల్ల ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్లో ఎంతో మొత్తం ఉందనే విషయం తెలుస్తుంది. ఈపీఎఫ్‌వో సభ్యులకు కేటాయించే 12 అంకెల యూఏఎన్ నంబర్ కొన్ని సందర్భాలలో మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు టెన్షన్ పడుతుంటారు. ఈ యూఏఎన్ నంబర్ ద్వారా ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం, కేవైసీ, ఇతర వివరాలు తెలుసుకోవడం, లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే క్లెయిమ్ చేసుకోవాలన్నా యూఏఎన్ నంబర్ ద్వార్ లాగి అయి చేసుకోవచ్చు. ఒక వేళ యూఏఎన్ నంబర్ మర్చిపోయినట్లయితే తెలుసుకునే సదుపాయం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీ పీఎఫ్ ఖాతాకు మొబైల్ నంబర్ అనుసంధానమై ఉండటం తప్పనిసరి.
యూఏఎన్ నంబర్ ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడం ఎలా..?
- అధికారిక వెబ్ సైట్ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ఉన్న నో యు యుఏఎన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మెంబర్ ఐడీ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాలి. పీఎఫ్ మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.
- గెట్ ఆథరైజేషన్ పిన్‌పై క్లిక్ చేయాలి.
- పీఎఫ్ మెంబర్ ఐడీతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు ఒక పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.
- వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.
- యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా: యూఏఎన్ యాక్టివ్‌గా ఉన్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 77382 99899కు ఎస్‌ఎంఎస్ చేయడం ద్వారా యూఏఎన్ నంబరు, ఖాతా బ్యాలెన్స్ వంటి వివరాలను పొందవచ్చు. ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లంలో ఎస్సెమ్మెస్ పొందేందుకు EPFOHO UAN అనిటైప్ చేసి 77382 99899కి ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాంతీయ భాషల్లో పొందాలంటే ఆ భాషకు సంబంధించి మొదటి మూడు అక్షరాలు కూడా టైప్ చేయాలి. ఉదాహరణకు తెలుగులో వివరాలు పొందాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి 77382 99899కు ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా ఎస్‌ఎంఎస్ పంపితే.. ఈపీఎఫ్‌ఓ చివరి కాంట్రీబ్యూషన్‌తో పాటు బ్యాలెన్స్, యూఏఎన్ నంబరు, పీఎఫ్ బ్యాలెన్స్ వంటి వివరాలతో ఈపీఎఫ్‌ఓ నుంచి ఎస్సెమ్మెస్ వస్తుంది.
మిస్డ్ కాల్ ద్వారా: మీ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈ సదుపాయం పొందవచ్చు. ఈపీఎఫ్‌ఓ సభ్యులు తమ రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి 99660 44425 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈ వివరాలు పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి