- Telugu News Photo Gallery Cheapest suv cars under 10 lakhs mahindra thar brezza nexon sonet automobile news in telugu
SUV Cars: రూ. 10 లక్షలలోపు తక్కువ ధరకే లభించే 5 సీటర్ కార్లు ఇవే.. ఓ లుక్కేయండి!
లోబడ్జెట్‌లో 5 సీటర్ ఎస్‌యూవీ కార్లు కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పలు రకాల మోడల్స్‌ను..
Updated on: Jan 10, 2023 | 9:09 AM

లోబడ్జెట్‌లో 5 సీటర్ ఎస్‌యూవీ కార్లు కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పలు రకాల మోడల్స్‌ను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతున్నాయి. మరి అవేంటో చూసేద్దాం..

మహీంద్రా థార్ చౌకైన మోడల్ వచ్చేసింది. 2WD వేరియంట్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.9.99 లక్షలకు అందుబాటులో ఉంది. దీనికి SUVకి 1.5 లీటర్ డీజిల్, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ AT ఇంజిన్ ఎంపికలు ఇవ్వబడింది. ఈ కారు డెలివరీలు జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర మొదటి 10,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మరి రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఇతర SUVలను చూసేద్దాం పదండి.

టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.69 లక్షలు. దీని బేస్ మోడల్ 1199 cc పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. మైలేజీ గురించి చెప్పాలంటే, ఈ SUV లీటర్‌కు 17.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.62 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. దీనికి కూడా 1197 cc ఇంజిన్ అమర్చబడింది. అదే సమయంలో, పవర్ ట్రాన్స్మిషన్ కోసం మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ 7 రంగు ఎంపికలలో అందుబాటులో లభిస్తోంది.

దక్షిణ కొరియా కంపెనీ కియా సోనెట్ SUVని అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. స్పెసిఫికేషన్ల పరంగా, SUV బేస్ వెర్షన్‌కు 1197 cc పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. కియా సోనెట్ ఒక లీటర్ పెట్రోల్‌తో 18.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.

మహీంద్రా XUV300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ SUV బేస్ మోడల్ 1197 cc ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. దీని మైలేజ్ 16.82 kmpl.

మారుతి బ్రెజ్జా.. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షలు. దీని బేస్ మోడల్ 1462 cc పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ SUV 20.15 kmpl మైలేజీని ఇస్తుంది.





























