Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలో బాలికకు 15 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే డిపాజిట్‌ చేయాలా? నిబంధనలు ఏంటి?

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ధి యోజన..

Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలో బాలికకు 15 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే డిపాజిట్‌ చేయాలా? నిబంధనలు ఏంటి?
Sukanya Samriddhi Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2023 | 3:55 PM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకం ఒకటి. ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకాలలో ఇదొకటి. ఈ ఖాతాను తల్లిదండ్రులలో ఒకరు లేదా బాలిక చట్టపరమైన సంరక్షకుడు నిర్వహించవచ్చు.

అయితే ఈ సుకన్య సమృద్ది అకౌంట్‌ తెరిచి వారికి ఎన్నో అపోహాలు వస్తుంటాయి. కానీ ఎవరెవరో చెప్పారు కదా అని నమ్మకూడదు. ఇలా నమ్మినట్లయితే అనవసరమైన టెన్షన్‌కు గురవుతుంటారు. స్కీమ్‌ నిబంధనలు ఏమిటి..? ఎంత కాలం డిపాజిట్‌ చేయవచ్చు.. స్కీమ్‌ మెచ్యూరిటీ కాలం ఎంత తదితర వివరాలను ముందగా తెలుసుకోవాలి. ఈ స్కీమ్‌ బ్యాంకు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. ఖాతా తెరిచే ముందు బ్యాంకు అధికారులను గానీ, పోస్టల్‌ శాఖ అధికారులను గానీ అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే తమ కుమార్తెకు 15 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే ఎస్‌ఎస్‌వై ఖాతాల్లో పెట్టుబడి పెట్టవచ్చనే అపోహ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం.

మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో ఎంతకాలం డిపాజిట్ చేయవచ్చు?

సుకన్య సమృద్ధి ఖాతా పథకం 2019 ప్రకారం.. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నాటికి బాలికకు 10 సంవత్సరాలలోపు ఉండాలి. అప్పుడు ఈ స్కీమ్‌లో అకౌంట్‌ తీసేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ అమ్మాయికి 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె పేరు మీద సుకన్య సమృద్ది ఖాతాను తెరిస్తే మీరు 15 సంవత్సరాల వరకు అంటే ఆమె 24 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వ్యవధి పూర్తయ్యే వరకు ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు అని సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ 2019 నియమాలు చెబుతున్నాయి. ఈ స్కీమ్‌ కింద ఖాతా తెరిచి నాటి తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్‌ చేసిన తర్వాత 21 సంవత్సరాలకు తర్వాతే మెచ్యూర్‌ అవుతుందని గుర్తించుకోవాలని నియమాలు చెబుతున్నాయి. అంటే ఆడపిల్లకు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఖాతా తెరిస్తే ఖాతా 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు ఎస్‌ఎస్‌వై ఖాతాను ఎంతకాలం ఆపరేట్ చేయవచ్చు?

బాలికకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను సంరక్షకుడు/తల్లిదండ్రులు నిర్వహించవచ్చని డిపాజిటర్లు గుర్తుంచుకోవాలి. ఖాతా హోల్డర్‌కు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఖాతా సంరక్షకులచే నిర్వహించడం జరుగుతుంది. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా బాలికనే స్వయంగా ఖాతాను నిర్వహించవచ్చని స్కీమ్‌ నిబంధనలు తెలియజేస్తున్నాయి. సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ ఖాతాను 21 సంవత్సరాలు పూర్తి చేసేలోపు ముందస్తుగా ఖాతాను మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారు వివాహం కారణంగా అటువంటి అభ్యర్థనతో దరఖాస్తు చేసుకుంటే అప్పుడు ఖాతాను మూసివేయవచ్చు. అయితే వివాహం జరిగిన తేదీ నుండి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన తేదీ నుండి మూడు నెలల తర్వాత సమయంలో ఖాతాను మూసివేసేందుకు అనుమతి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి