Money Tranfer: ఒకరి బ్యాంకు ఎకౌంట్ లో డబ్బులు వేయబోయి..వేరొకరి ఖాతాలో జమ చేశారా? ఇలా చేస్తే మీ డబ్బు వాపస్..
ముఖ్యంగా మన వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులను వేరొకరికి పంపుతుంటాం. ఏదో పరధ్యానంలో ఉండి డబ్బులను ఒకరికి పంపబోయి వేరొకరికి పంపేసి వెంటనే నాలుక్కరుచుకుంటాం. అలాగే యూపీఐ ద్వారా డబ్బులను పంపే సమయంలో ఒక మొబైల్ నంబర్ బదులు వేరే మొబైల్ నెంబర్ కు పంపెస్తుంటాం. ఇలాంటి సమయంలో ఎలా నడుచుకోవాలి? ఖాతాదారుల వివరాలు ఎలా తెలుకోవాలి?
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో విశేషమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి చిన్న విషయానికి బ్యాంకులకు వెళ్లే పరిస్థితి నుంచి మనం వాడే స్మార్ట్ ఫోన్ లో బ్యాంకింగ్ సేవలను పొందే పరిస్థితికి వచ్చాం. అయితే ఫ్రెండ్లీ బ్యాంకింగ్ వల్ల ఎన్ని లాభాలున్నా..అదే స్థాయిలో నష్టాలుంటాయి. ముఖ్యంగా మన వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులను వేరొకరికి పంపుతుంటాం. ఏదో పరధ్యానంలో ఉండి డబ్బులను ఒకరికి పంపబోయి వేరొకరికి పంపేసి వెంటనే నాలుక్కరుచుకుంటాం. అలాగే యూపీఐ ద్వారా డబ్బులను పంపే సమయంలో ఒక మొబైల్ నంబర్ బదులు వేరే మొబైల్ నెంబర్ కు పంపెస్తుంటాం. ఇలాంటి సమయంలో ఎలా నడుచుకోవాలి? ఖాతాదారుల వివరాలు ఎలా తెలుకోవాలి? పొరపాటున మన డబ్బును వేరేవారి ఖాతాకు పంపితే వాటిని తిరిగి ఎలా రప్పించుకోవాలి? ఎవరికి కంప్లయింట్ చేయాలి? బ్యాంకు నిబంధనలు ఏంటి? ఆ విషయాలను ఓ సారి చూద్దాం.
బ్యాంకుకు తెలియజేయాలి
మనం పొరపాటున డబ్బును వేరే వారికి పంపినప్పుడు వెంటనే జరిగిన పొరపాటును బ్యాంకుకు నివేదించాలి. బ్రాంచ్ ను సందర్శించి అక్కడి మేనేజర్ కు పొరపాటు తెలిపి, చర్యలు తీసుకోమని అభ్యర్థించవచ్చు. అలాగే కాల్ సెంటర్, లేదా బ్యాంకు హెల్ప్ లైన్ కు మెయిల్ చేసి కూడా పొరపాటు తెలిపే అవకాశం ఉంది. కంప్లయింట్ చేసే సమయంలో బదిలీ నెంబర్, తేదీ సమయాన్ని కచ్చితంగా తెలపాలి. ఇలా చేస్తే నిబంధనలు ప్రకారం బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటారు.
రివర్స్ ట్రాన్స్ యాక్షన్
మనం డబ్బులు పంపిన సమయంలో ఖాతా నెంబర్, ఐఎఫ్ ఎస్ సీ కోడ్ తప్పుగా ఎంటర్ చేస్తే వెంటనే మన ఖాతా లోంచి డబ్బు వెళ్తుంది. కానీ.. కొంత సమయం తర్వాత ఆ ఖాతా నెంబర్ సరికాదని డబ్బు మళ్లీ మన ఎకౌంట్ లోకే పడుతుంది. అలాగే మనం డబ్బును వేరేవారికి పంపిన సమయంలో ఆ ఖాతా కూడా మన ఖాతా ఉన్న బ్రాంచ్ లో ఉండే వెంటనే డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకు అధికారి వెంటనే చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.
చర్యలు ఇలా..
అనుకోకుండా మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేస్తే నిధులను తిరిగి పొందేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇలాంటి వివాదాలను పరిష్కరించేందుకు బ్యాంకులకు రెండు నెలల సమయం పట్టవచ్చు. మీ బ్యాంక్‌ని సంప్రదించడం ద్వారా ఏ నగరంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ ఏ ఖాతాకు నిధులను బదిలీ చేసిందో తెలుసుకోవాలి. అనంతరం మీ డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించడానికి మీరు ఆ శాఖను కూడా సంప్రదించవచ్చు. మీ సమాచారం ఆధారంగా పొరపాటున ఖాతాలో డబ్బు బదిలీ చేయబడిన వ్యక్తికి బ్యాంక్ తెలియజేస్తుంది. తప్పుగా బదిలీ చేయబడిన నిధులను తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ ఆ వ్యక్తి నుండి అనుమతిని కోరుతుంది. అతను అనుమతి ఇస్తే వెంటనే మీ ఖాతాలోకి డబ్బును పంపుతారు.
ముందు జాగ్రత్తలే మేలు
- బ్యాంక్ వెబ్‌సైట్‌లో సరైన ఐఎఫ్ ఎస్ సీ కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్‌తో సహా సరైన సమాచారాన్ని నమోదు చేయడానికి చెల్లింపుదారుగా కస్టమర్ బాధ్యత వహించాలి లావాదేవీని కొనసాగించే ముందు రెండు లేదా మూడు సార్లు ధ్రువీకరించడం మంచిది.
- పెద్ద లావాదేవీని చేయడానికి ముందు, గ్రహీత డబ్బును స్వీకరించినట్లుధ్రువీకరించుకోడానికి కొంత మొత్తం పంపి సరి చూసుకోవడం ఉత్తమం
- స్థానిక బ్యాంక్ బ్రాంచ్ వివరాలు ఎల్లప్పుడూ మన వద్ద అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాంకింగ్ లో ఎలాంటి అవసరం వచ్చినా కచ్చితంగా వారికే సమాచారం ఇవ్వాలి కాబట్టి స్థానిక బ్రాంచ్ వివరాలు మన ఫోన్ సేవ్ చేసుకోవడం మంచిది.
అయితే మన డబ్బును వేరే వారి ఖతాకు బదిలీ చేసినప్పుడు బ్యాంక్ అధికారులు కచ్చితంగా మనకు సాయం చేయాలి. ఈ మేరకు ఆర్బీఐ నిబంధనలు కూడా ఉన్నాయి. పొరపాటున వేరొకరి ఖాతాకు నగదు బదిలీ అయితే, మీ బ్యాంకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. వేరే ఖాతా నుంచి సరైన ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి బ్యాంక్ బాధ్యత వహించాలని సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..