Business: మీలో ఈ ఐదు క్వాలిటీలు ఉంటే మీరూ టాప్ బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు

అందరికి సంపాదించాలని కోరిక ఉంటుంది. డబ్బుపై అందరికి ఆశ ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం వైపు వెళితే డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే..

Business: మీలో ఈ ఐదు క్వాలిటీలు ఉంటే మీరూ టాప్ బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు
Business Man
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2023 | 7:26 PM

అందరికి సంపాదించాలని కోరిక ఉంటుంది. డబ్బుపై అందరికి ఆశ ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం వైపు వెళితే డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే డబ్బు సంపాదించాలంటే అది అందరికి సాధ్యం కాదు. అందుకు కొన్ని క్వాలిటీస్‌ ఉండాలి. అప్పుడు బిజినెస్‌ చేసి డబ్బు సంపాదించేందుకు ఆస్కారం ఉంటుంది. బిజినెస్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకునే ముందుకు సాగాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెనక్కి తగ్గితే బిజినెస్‌లో రాణించలేరు. అందుకే అన్ని రకాల క్వాలిటీస్‌ ఉన్నప్పుడు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఒక సమయంలో వ్యాపారంలో నష్టాలు సంభవిస్తే వాటిని తట్టుకునే ముందుకు సాగదితే అది వ్యాపారవేత్త లక్ష్యం. మీరు కూడా వ్యాపారంలో చేయాలని భావిస్తుంటే.. విజయవంతంగా ముందుకెళ్లాలి. అప్పుడు మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న స్థాయిలో బిజినెస్ ప్రారంభించి వ్యాపార రంగంలో తమదైన ముద్రవేసిన వారు చాలా మందే ఉన్నారు. వారి సక్సెస్ చూసినపుడు ఏదైనా మేజిక్ జరిగిందా? అనిపిస్తుంది. కానీ.. ఎటువంటి మ్యాజిక్ దీని వెనుక ఉండదు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆ విజయబాటను వేస్తాయి. విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే.. బిజినెస్ అనే ఉత్సాహం ఒక్కటే సరిపోదు. దాని కోసం కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 5 నైపుణ్యాలు బిజినెస్ లో అద్భుతమైన విజయాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

మొదటిది నైపుణ్యం: వ్యక్తులతో సరిగ్గా వ్యవహరించడం. అవును మనకు తోటి వారితో ఎలా మెలాగాలో తెలియకపోతే ఏ వ్యాపారంలోనూ రాణించలేం. ఒక బిజినెస్ మేన్ జీవితంలో ఎందరితోనో వ్యవహరించేదానిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, కస్టమర్స్, మీడియా.. ఇలా రకరకాల వ్యక్తులతో నిత్యం ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. వీరందరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది. ఒక వ్యాపార వేత్త లేదా బిజినెస్ ఫౌండర్ తన జీవితంలో ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. అది కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి పరిస్థితులను నిర్వహించే నైపుణ్యం వ్యాపారానికి అవసరం. ఈ నైపుణ్యం ప్రపంచంలోని దాదాపు అన్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో కనిపిస్తుంది.

ఇలా విజయవంతమైన వ్యాపారులలో ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే ప్రజల మంచి కోసం ఆలోచించడం. ఇక్కడ ప్రజలు అంటే ఉద్యోగుల దగ్గర నుంచి ఎండ్ కస్టమర్ వరకూ మాత్రమే కాదు సమాజంలోఉండే అందరూ అని అర్ధం. మంచి కమ్యూనికేషన్, ఇంటర్-పర్సనల్ స్కిల్స్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మీకు బాలాన్నిచ్చే నైపుణ్యాలు. మీకు ఈ నైపుణ్యాలు ఉంటే, ఖచ్చితంగా మీరు బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభిస్తారు. మీ వ్యాపారాన్ని వేగంగా డెవలప్ చేయగలుగుతారు.

ఇవి కూడా చదవండి

ఇక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలంటే కావాల్సిన రెండో నైపుణ్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉత్సాహం. లాంగ్ టర్మ్ లో మీరు వ్యాపారవేత్తగా రాణించాలి అనుకుంటే.. మీ ప్రొడక్ట్స్ ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచగలవు అని నిరంతరం ఆలోచించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడం.. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం వ్యాపార విజయానికి దోహదం చేస్తాయి. ప్రజల అభివృద్ధి.. అవసరాలను ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్‌లో ఎప్పుడూ విజయవంతమవుతాయి. అయితే అది అంత తేలికైన పని కాదు. దీని కోసం, నిరంతర అభిప్రాయం ఆధారంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి.. సవరించాలి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కూడా చాలా సంవత్సరాలు లేదా ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాల్సి ఉంటుంది.

లాజికల్‌, క్రియేటివ్‌ థింకింగ్‌ ముఖ్యం:

లాజికల్, క్రియేటివ్ థింకింగ్ అలాగే క్విక్ లెర్నింగ్ అంటే వేగంగా విషయాలను నేర్చుకోవడం లేదా అర్ధం చేసుకోవడం మూడో నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ లో నిరంతరం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటి పరిష్కారానికి లాజికల్‌గా ఆలోచించి సరైన నిర్ణయం వేగంగా తీసుకోవడం ఒక బిజినెస్ మేన్‌కి ఊపిరి వంటిదని చెప్పవచ్చు. అంటే.. ఈ పనిని అతను ప్రతి క్షణం చేయాల్సి ఉంటుంది. ఒక సమస్య వచ్చినపుడు కాలయాపన లేకుండా.. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో అలాగే వ్యాపార వృద్ధికి వ్యూహాలను రూపొందించడంలో సహాయపడుతుంది.

వ్యాపారవేత్తలు తరచుగా సవాళ్లు అలాగే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటారు. ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ తరువాత ఇవ్వాల్సిన ఫండ్స్ నిలిపివేయడం దగ్గర నుంచి టీం మెంబర్ ప్రాజెక్ట్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడానికి నిరాకరించడం వరకు ఏదైనా సరే అనుకోని పరిస్థితులు ఎదుర్కొవలసి రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే లాజికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్కెట్లో ఉండే పోటీకి అనుగుణంగా కొత్త ప్రొడక్ట్స్ లేదా సర్వీసులు అందించడానికి నిరంతరం క్రియేటివ్ గా ఆలోచించ గలగాలి. అప్పుడే ఇండస్ట్రీలో ది బెస్ట్ అనాదగ్గ ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతారు. దీని కోసం కొత్త టెక్నాలజీని వేగంగా అర్ధం చేసుకోవడం నేర్చుకునే సామర్ధ్యం మీ వ్యాపారానికి వెన్నెముకలా నిలుస్తుంది.

ఇక అనుకున్న ప్లాన్‌ను అనుకున్నట్టుగా అమలు చేయగలగడం నాలుగో నైపుణ్యం. నిపుణులు ఏమంటారంటే ప్లానింగ్ చాలా సులభం.. కానీ అమలు చేయడం చాలా కష్టం అని. ఎందుకంటే.. ప్లానింగ్ చేయడానికి కాస్త సమయం.. మరికాస్త తెలివితేటలూ.. కొద్దిగా విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. కానీ దానిని పక్కాగా అమలు చేయాలంటే చాలా కష్టపడాలి. ఉదాహరణకు ఒక ప్రొడక్ట్ ఈ సమయంలోపు మార్కెట్లోకి తీసుకు వద్దాం అనే ప్లానింగ్ చేసిన తరువాత దాని అమలులో చాలా చిక్కులు రావచ్చు. వాటన్నిటినీ తట్టుకుని కచ్చితంగా అనుకున్న సమయానికి మార్కెట్లోకి ప్రొడక్ట్ రిలీజ్ చేయడం అనేది సవాళుతో కూడుకున్న పని. అందుకే.. ప్లానింగ్ సమయంలోనే సాధ్యాసాధ్యాలు లెక్క వేసుకుని.. మన కేపబిలిటీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. కచ్చితంగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ పనులు పూర్తి అయ్యేలా ప్రయత్నించాలి. టీం ను పరుగులు తీయించగలగాలి.

దీనికోసం సమన్వయం చాలా ముఖ్యమైనది. ప్లాన్ సరిగ్గా అమలు చేయాలంటే వివిధ విభాగాలు.. రకరకాల వ్యక్తులు.. అన్నిటినీ సమన్వయం చేసుకోగలగడం చాలా అవసరం. ఇక్కడ చాలా ముఖ్యమైన ఎలిమెంట్ టైమ్ మేనేజిమెంట్. కచ్చితమైన సమయపాలన పాటించడం తప్పనిసరిగా విజయానికి ఒక మెట్టు అని చెప్పవచ్చు. ఇక చివరిది కానీ, చాలా ముఖ్యమైనది.. ఫైనాన్షియల్ మేనేజిమెంట్.. దీనినే ఆర్థిక నైపుణ్యం అని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపారం అంతిమ లక్ష్యం డబ్బు సంపాదించడం. దీనికి ఆర్థిక నైపుణ్యాలు చాలా అవసరం. ఇందులో బడ్జెటింగ్, ఫైనాన్స్‌లను ట్రాక్ చేయడం, పెట్టుబడిపై రాబడిని సకాలంలో పర్యవేక్షించడం, అవసరమైనప్పుడు నిధులను ఏర్పాటు చేయడం మొదలైనవి ఉంటాయి.

రెండేళ్ల వరకు లాభాలు ఆశించవద్దు:

అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించినపుడు.. కనీసం రెండేళ్ల వరకూ దాని నుంచి విపరీతమైన లాభాలు వస్తాయనో ఆశించడం మంచిది కాదు. ఏ వ్యాపారమైనా క్రమేపీ పుంజుకుంటుంది. అది పుంజుకునే వరకూ ఎన్నో ఒడిదుకులు వస్తుంటాయి.. వాటిని తట్టుకుని నిలబడటం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఎటువంటి వ్యాపారానికైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం అనే విషయమూ అర్ధం చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!