PM Kisan Yojana: మీ ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తయ్యిందా? వీటిలో ఒక్కటి కూడా అసంపూర్తిగా ఉన్నా 13వ విడత డబ్బులు నిలిచిపోవచ్చు!
రైతులకు అలర్ట్.. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద రైతులు ప్రతి ఏడాది రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. పంట..
రైతులకు అలర్ట్.. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద రైతులు ప్రతి ఏడాది రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. పంట ఖర్చుల నిమిత్తం మోడీ ప్రభుత్వం మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌లో కూడా అక్రమాలు జరుగుతుండటంతో మోడీ సర్కార్ కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. అర్హులైన రైతులే కాకుండా అనర్హత కలిగిన రైతులు కూడా ఈ ప్రయోజనం పొందుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం వివిధ పథకాలు అమలు చేస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వర్గాల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో డబ్బులు పొందుతున్న రైతులు ఈ- కేవైసీ (e-KYC) చేసుకోవడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రభుత్వం కేవైసీ చేయని రైతులు తప్పనిసరిగా పూర్తి చేయాలని పదేపదే చెబుతున్నారు. కేవైసీ చేయని రైతులకు వచ్చే 13వ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నా.. కొందరు ఇంకా కేవైసీ పూర్తి చేయలేని, అలాంటి రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం పొందలేరని, ఈ విడత నుంచి డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని కేంద్ర అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
అదే సమయంలో ఇప్పుడు 13వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే రైతులు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది ప్రభుత్వం. మీ వాయిదాల డబ్బులు నిలిచిపోకూడదనుకుంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం ముఖ్యం.
ఈకేవైసీ చేయడం ఎలా?
మీరు e-KYCని రెండు విధాలుగా చేసుకోవచ్చు. ముందుగా మీరు పథకం pmkisan.gov.in అధికారిక పోర్టల్‌ని సందర్శించి ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)తో ఈకేవైసీని పొందవచ్చు. ఇది కాకుండా మీరు మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాలు, ఇతర ఆన్‌లైన్ సెంటర్లను సందర్శించి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
ల్యాండ్ వెరిఫికేషన్:
ఇక రైతులు ఈకేవైసీ పూర్తి చేసినా.. మరో పని కూడా పూర్తి చేసుకోవాలి. మీ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బు నిలిచిపోకూడదని అనుకుంటే వీలైనంత త్వరగా ల్యాండ్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి. కేవైసీ చేసి ఇది చేయకున్నా డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది. దీని కోసం మీరు సమీపంలోని వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడ మీరు భూమికి సంబంధించిన పత్రాలు వ్యవసాయ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అధికారులు పత్రాలను పరిశీలించి వెరిఫై చేస్తారు. లబ్ధిదారుడు దీనిని పూర్తి చేయకపోతే అతని వాయిదాల డబ్బు నిలిచిపోవచ్చు.
13వ విడత ఎప్పుడు వస్తాయి?
ఈ పథకం కింద ఇప్పటి వరకు 12వ విడత డబ్బులు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 13వ విడత రావాల్సి ఉంది. మీడియా కథనాల ప్రకారం.. ఈ విడత ఈ జనవరి నెలలో రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..