Jio True 5G Services: తెలంగాణలోని రెండు పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు.. యూజర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 4జీ సేవలు మాత్రమే ఉండగా, ఇటీవల 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 5జీ రిలయన్స్ జియో దూసుకుపోతోంది. దేశంలో ఐదు ప్రధాన..
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 4జీ సేవలు మాత్రమే ఉండగా, ఇటీవల 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 5జీ రిలయన్స్ జియో దూసుకుపోతోంది. దేశంలో ఐదు ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ 5జీ వసేలను అందించగా, మరికొన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ 5జీ సేవలు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తావివ్వనుంది.
జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువల్ల ఈ గణనీయమైన మార్పుకు ఉన్న శక్తి, దాని అపార ప్రయోజనాలను మన దేశంలోని ప్రతి పౌరుడు అనుభవించగలడు. తెలంగాణ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
జనవరి 10 నుంచి వరంగల్, కరీంనగర్ లలో జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. వరంగల్, కరీంనగర్‌లతో పాటు దేశ వ్యాప్తంగా 4 రాష్ట్రాల లోని ఆరు నగరాలలో- అస్సాం (గౌహతి), కర్ణాటక (హుబ్లీ-ధార్వాడ్, మంగళూరు, బెల్గామ్), కేరళ (చేర్తాల), మహారాష్ట్ర (షోలాపూర్) జియో ట్రూ 5G సేవలు ప్రారంభం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 93 నగరాలలో జియో తన ట్రూ 5G సేవలు అందిస్తోంది.
జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4జీ ఎల్ టిఇ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆల్-ఐపీ డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్‌ను నిర్మించింది. వారసత్వ మౌలిక సదుపాయాలు, దేశీయ 5 జి స్టాక్ లేకుండానే ఇప్పుడు 5 జి నెట్ వర్క్ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయి నుంచే మొబైల్ వీడియో నెట్‌వర్క్‌గా భావిస్తున్న ఏకైక నెట్ వర్క్ ఇది. ఇది భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంది. సాంకేతికతలు 6జి, అంతకు మించి ముందుకు సాగుతున్నందున మరింత డేటాకు మద్దతు ఇవ్వడానికి సులభంగా అప్ గ్రేడ్ చేయవచ్చని అన్నారు. 1.3 బిలియన్ల (130 కోట్ల) మంది భారతీయులకు డిజిటల్ ఇండియా దార్శనికతను ప్రారంభించడానికి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానం దిశగా నడిపించడానికి జియో భారతీయ డిజిటల్ సేవల రంగంలో అపారమైన మార్పులను తీసుకొచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ జీవితాన్ని గడపడానికి నెట్ వర్క్, పరికరాలు, అప్లకేషన్లు, కంటెంట్, సేవా అనుభవం, సరసమైన టారిఫ్‌లతో కూడిన వ్యవస్థను సృష్టించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి