AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mistary Lake: ఈ సరస్సు సైన్స్‌కు సవాల్.. రాత్రి నీలంరంగులో కనువిందు.. దగ్గరకు వెళ్లాలంటే భయం.. ఎందుకంటే

ఈ వింత సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని  కవా ఇజెన్ సరస్సు అని పిలుస్తారు. ఈ సరస్సు  ఇండోనేషియాలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. దీని ప్రత్యేకత ఏమిటంటే పగటి సమయంలో ఇది సాధారణ సరస్సులా కనిపిస్తుంది. చీకటి పడుతూ రాత్రి అవుతుంటే ఈ సరస్సు లోని నీరు నీలం రంగులోకి మారుతుంది.

Mistary Lake: ఈ సరస్సు సైన్స్‌కు సవాల్.. రాత్రి నీలంరంగులో కనువిందు.. దగ్గరకు వెళ్లాలంటే భయం.. ఎందుకంటే
Kawah Ijen Lake
Surya Kala
|

Updated on: Jun 11, 2023 | 11:52 AM

Share

ఈ ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన రహస్యాలకు కొదవలేదు. మానవుడు తన మేథస్సుతో ఎంతగా పురోగమిస్తున్నప్పటికీ సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి. కొన్ని రహస్యాలు మానవ తెలివి తేటలకు సవాల్ చేస్తూ సాల్వ్ చేయమంటున్నాయి. అనేక ప్రదేశాల్లోని మిస్టరీని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే మిస్టరీని చెందించే విషయంలో ఇప్పటికీ సక్సెస్ కానివి ఎన్నో ఉన్నాయి. అయితే వాస్తవం ఏమిటో తెలియకపోయినా.. శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఓ సరస్సు రాత్రివేళ రంగులు మార్చుకుంటుంది. రాత్రిపూట స్వయంచాలకంగా నీలం రంగులోకి మారే ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది.

ఈ వింత సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని  కవా ఇజెన్ సరస్సు అని పిలుస్తారు. ఈ సరస్సు  ఇండోనేషియాలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. దీని ప్రత్యేకత ఏమిటంటే పగటి సమయంలో ఇది సాధారణ సరస్సులా కనిపిస్తుంది. చీకటి పడుతూ రాత్రి అవుతుంటే ఈ సరస్సు లోని నీరు నీలం రంగులోకి మారుతుంది. ఆ సమయంలో అది సరస్సులా కనిపించదు. ఒక నీలం రంగు రాయిలా కనిపిస్తుంది.  పర్యాటకులను, పకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. అయితే ఈ సరస్సు నీలి రంగులో ఎంత అందంగా కనిపించినా.. ఇందులోని నీరు ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండి.. వేడి నేరుగా ఉంటుంది. కనుక ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే.. నీటి సరస్సు దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు.

మిస్టరీ ఇంకా రివీల్ కాలేదు ఈ సరస్సు చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరం అంటే.. శాస్త్రవేత్తలు కూడా ఈ సరస్సు చుట్టూ ఎక్కువ కాలం ఉండటానికి ధైర్యం చేయరు. అయితే ఈ సరస్సు ఫోటోలను ఉపగ్రహం నుండి చాలా సార్లు తీశారు. ఈ ఫొటోలో సరస్సు లోని నీరు రాత్రి సమయంలో స్వయంచాలకంగా ఆకుపచ్చ, నీలం రంగులోకి మారుతుంది. గత కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ సరస్సుకు ఈ రంగులు ఎలా రాత్రివేళ వస్తున్నాయనే విషయంపై ఇప్పటి వరకూ ఖచ్చితమైన ఆధారాలు లేవు.

ఇవి కూడా చదవండి

అయితే వాస్తవానికి ఈ సరస్సు నీటి సరస్సు కాదు, యాసిడ్ సరస్సు. ఈ సరస్సు చుట్టూ అనేక  అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ అగ్ని పర్వతాల నుంచి హైడ్రోజన్ క్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ వంటి అనేక రకాల వాయువులు నిత్యం బయల్పడుతూ ఉంటాయి. ఈ అన్ని వాయువుల ప్రతిచర్య కారణంగా సరస్సులోని నీరు నీలం రంగులో మారుతూ కనిపిస్తుంది. అయితే ఈ సరస్సులోని మిస్టరీ ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..