భలే ఐడియా బాబాయ్.. మట్టి పెడ్డల నుంచి పెసలను భలే వేరు చేశాడు..
మట్టి పెళ్ళలతో నిండిన పెసల బస్తా నుండి కేవలం అరగంటలో శుభ్రమైన పెసలను వెలికితీసే అద్భుతమైన విధానం ఇది. నీటిని ఉపయోగించి మట్టిని తొలగించి, పెసలను వేరుచేయడం ద్వారా 50 కేజీల బస్తా నుండి 7-8 కేజీల విలువైన పెసలను పొందవచ్చు. ఇది శ్రమతో కూడుకున్నదైనా, ఆర్థికంగా లాభదాయకమైన పని.

ఈ మట్టి పెళ్ళలతో నిండిన పెసల బస్తాను సదరు వ్యక్తి తను పని చేసే కొట్టు దగ్గర నుంచి తీసుకువచ్చాడు. అక్కడ పెసల ప్రాసెసింగ్ సమయంలో మట్టి పెళ్ళలతో కూడిన వ్యర్థాలను పక్కన పడేస్తారు. పని చేసేవారు వాటిని పంచుకుంటారు, అలా అతను ఈ బస్తాను ఇంటికి తెచ్చాడు. మట్టి పెళ్ళలతో నిండిన ఒక 50 కేజీల బస్తా నుంచి పెసలను వేరు చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్. ఈ మట్టి నుంచి పెసలను వేరు చేయడానికి చాలా సమయం పడుతుంది అనుకుంటాం. అందుకోసం నడుం నొప్పులు, చేతుల నొప్పులు బోనస్ అని మనం భావిస్తాం. కానీ ఇతను కేవలం అరగంటలో ఆ పని చేసేశాడు. మనసుంటే కచ్చితంగా మార్గం ఉంటుంది చేసి చూపించాడు. ఈ బస్తాలోని మట్టి పెళ్ళల నుంచి పెసలను వెలికితీసేందుకు అతను ఎన్నుకున్న మార్గం చాలా ఈజీ.
ముందుగా, మట్టి, పెసలు కలిసిన మిశ్రమాన్ని ఒక పెద్ద బకెట్‌లో వేసుకున్నారు. దాన్ని నీటితో నింపి, చేతులతో బాగా కడిగారు. ఈ మొదటి కడుగుతో మట్టి అంతా బురద రూపంలో నీటిలో కలిసిపోయింది. ఆ మురికి నీటిని పారబోసి, మిశ్రమాన్ని గంపలోకి తీసుకున్నారు. గంపలో ఉన్న మిశ్రమాన్ని మరో రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో కడిగారు, అప్పుడు మిగిలిన బురద కూడా గంప రంధ్రాల ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఈ విధంగా పూర్తిగా శుభ్రం చేసిన పెసలను ఒక పట్టపై ఎండలో ఆరబెట్టారు. 50 కేజీల మురికి మిశ్రమం నుంచి ఈ ప్రక్రియ ద్వారా సుమారు 7 నుండి 8 కేజీల శుభ్రమైన పెసలను వెలికి తీయగలిగారు. ఈ పరిమాణంలో పెసలను బయట కొనుగోలు చేయాలంటే దాదాపు 500 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. కేవలం అరగంట శ్రమతో ఆయన ఆ నగదు సేవ్ చేశాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా. పెసలు పూర్తిగా ఎండిన తర్వాత, వాటిని చెరగడం ద్వారా ఏమైనా మిగిలిన చెత్త కూడా తొలగిపోతుంది. ఈ విధానం ఒక వ్యర్థ పదార్థంగా భావించిన దాని నుంచి విలువైన ఆహార ధాన్యాన్ని పొందవచ్చని నిరూపిస్తుంది.
పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?
