AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కిటికీల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వాస్తు ఏం చెబుతోంది..

అయితే ఇంటి నిర్మాణంలో కిటికీలు కూడా ముఖ్యమైనవి అని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి గాలి, వెలుతురు దారాలంగా రావాలని పండితులు చెబుతున్నారు. ఇలా గాలి, వెలుతురు పుష్కలంగా వస్తేనే ఆ ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. అందుకే ఇంట్లో కిటికీలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో...

Vastu Tips: కిటికీల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వాస్తు ఏం చెబుతోంది..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Mar 31, 2024 | 9:43 PM

Share

ఇంటి నిర్మాణానికి సంబంధించి వాస్తు కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఉండాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. అందుకు అనుగుణంగానే వాస్తు పండితులు చెప్పే విషయాలను పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్థలం మొదలు, ఇంటిలోపల నిర్మించే గదుల వరకు అన్నింటి విషయంలో వాస్తును తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తుంటారు.

అయితే ఇంటి నిర్మాణంలో కిటికీలు కూడా ముఖ్యమైనవి అని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి గాలి, వెలుతురు దారాలంగా రావాలని పండితులు చెబుతున్నారు. ఇలా గాలి, వెలుతురు పుష్కలంగా వస్తేనే ఆ ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. అందుకే ఇంట్లో కిటికీలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కచ్చితంగా కిటీకీల సంఖ్య సరి (ఈవెన్‌)గా ఉండాలని చెబుతున్నారు. అలాగే ప్రతీ గదిలో కచ్చితంగా ఒక కిటికీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. దక్షిణ దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం కంటే, ఉత్తర దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం ఎక్కువగా ఉండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే.. పశ్చిమ దిశలో ఉన్న కిటికీల మొత్తం వైశాల్యం కంటే, తూర్పు దిశలో ఉన్న కిటికీల వైశాల్యం ఎక్కువగా ఉండాలి.

తూర్పు దిశలో కిటీకీలు పెద్దగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల ఉదయం లేవగానే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వెంటిలేటర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కిటికీలు మూసిన సమయంలో కూడా గదిలోకి గాలి రావడానికి వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి కచ్చితంగా ప్రతీ గదిలో రెండు వెంటిలేటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇక బాత్రూమ్‌లు, టాయిలెట్లలో పెట్టే వెంటిలేటర్లు, రూముల్లో పెట్టే వెంటిలేటర్ల కంటే బాగా పెద్దవిగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన విషయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత ఆధారాలు లేవని గుర్తించాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..