Monthly Horoscope For April 2024: ఆర్థికంగా వారికి అంచనాలకు మించిన పురోగతి పక్కా.. 12 రాశుల వారికి మాసఫలాలు

మాస ఫలాలు (ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2024 వరకు): మేష రాశిలో బుధ, గురువులు, లాభస్థానంలో శనీశ్వరుడు సంచారం వల్ల ఆ రాశివారికి ఈ నెలంతా చాలావరకు పండగ మాదిరిగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో శుక్ర, రాహువులు, దశమంలో శనీశ్వరుడి సంచారం కారణంగా కొద్దిపాటి ఆటుపోట్లతో నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Monthly Horoscope For April 2024: ఆర్థికంగా వారికి అంచనాలకు మించిన పురోగతి పక్కా.. 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 31, 2024 | 10:07 PM

మాస ఫలాలు (ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2024 వరకు): మేష రాశిలో బుధ, గురువులు, లాభస్థానంలో శనీశ్వరుడు సంచారం వల్ల ఆ రాశివారికి ఈ నెలంతా చాలావరకు పండగ మాదిరిగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో శుక్ర, రాహువులు, దశమంలో శనీశ్వరుడి సంచారం కారణంగా కొద్దిపాటి ఆటుపోట్లతో నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఈ రాశిలో బుధ, గురువులు, లాభస్థానంలో శనీశ్వరుడు సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు పండగ మాదిరిగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి లేదా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇత రులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుకుంటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి తల్లితండ్రుల జోక్యంతో పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ నెలలో ఒకటి రెండు సార్లు ఆకస్మిక ధన యోగానికి అవకాశముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

లాభస్థానంలో శుక్ర, రాహువులు, దశమంలో శనీశ్వరుడి సంచారం కారణంగా కొద్దిపాటి ఆటుపోట్లతో నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. మధ్య మధ్య అధికారులతో తలపడే పరిస్థితులు ఎదురవుతాయి. తల్లితండ్రులతో ఆదరభావం పెరుగుతుంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. రాశినాథుడు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయత్నాలు సానుకూలపడ తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధి స్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సానుకూలంగానూ, ఆశాజనకంగానూ సాగిపోతుంది. భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శుభ గ్రహాల కారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ నెలంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు కొన్ని నెర వేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి, ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వీటివల్ల అధికారులు లబ్ధి పొందుతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

నెలంతా ఆశాజనకంగా సాగిపోతుంది. అష్టమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్య లున్నా అధిగమిస్తారు. శుభ గ్రహాల కారణంగా చాలావరకు సంతృప్తికరంగా, బాగా అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకో కుండా నెరవేరడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపో తాయి. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధు మిత్రులను ఆర్థికంగా ఆదు కోవడం కూడా జరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సజావుగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి తప్ప మిగిలిన గ్రహాలేవీ అనుకూలంగా లేనందువల్ల నెలంతా శుభాశుభ మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడి, విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది. అయితే, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. సప్తమంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ, అందుకు దీటుగా వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. మాట చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉంటాయి. అయితే, ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికపరంగా, కుటుంబపరంగా పురోగతి ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా శుభ పరిణామాలతో, శుభ వార్తలతో సాగిపోతుంది. ఈ రాశివారికి గత నెల కంటే ఈ నెల తప్పకుండా మెరుగ్గా, శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో పాటు వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగు తాయి. ఈ నెల నాలుగు గ్రహాలు రాశి మారే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా అభివృద్ధి బాట పడతారు. ఇవి ఆదాయాన్ని పెంచడమే కాక, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా నెగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

శుక్రుడు, బుధుడు, రాశ్యధిపతి కుజుడు ఈ నెలంతా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల కొద్ది శ్రమతో ఆర్థికంగా, ఉద్యోగపరంగా శుభప్రదంగా సాగిపోతుంది. ఏ రంగానికి చెందిన వారైనా సత్ఫ లితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు, సామాజికంగా పేరు ప్రతి ష్ఠలు పెరుగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చతుర్థంలో శనీశ్వ రుడి సంచారం వల్ల ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పంచమ స్థానంలో ఉన్న రాహువు కారణంగా అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

నెలాఖరు వరకు రాశ్యధిపతి గురువు పంచమంలోనూ, శనీశ్వరుడు తృతీయంలోనూ సంచారం చేయడం ఈ రాశివారికి మహా భాగ్య యోగాన్ని కలిగిస్తుంది. ఇతర శుభ గ్రహాలు కూడా బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, చతుర్థ స్థానంలో ఉన్న రాహువు కారణంగా ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. సుఖాలు, సౌకర్యాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం కూడా సానుకూలంగానే సాగిపోతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ స్థానాధిపతి శుక్రుడు ఉచ్ఛస్థానంలోకి వచ్చినందువల్ల ఉద్యోగ సంబంధమైన ఏ విషయమైనా అనుకూలంగా మారుతుంది. ఈ రాశివారి జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో జీత భత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ నెలలో శుభ గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతోంది. ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఫలితంగా, కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ప్రయత్నాలు ఫలించి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి ఉండే అవకాశం ఉంది. అయితే, ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. పిల్లలు చదు వుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలున్నాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్త వచ్చు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులేర్పడవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశ్యధిపతి గురువు ఈ నెల 30 వరకూ ద్వితీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఆర్థికంగా ఎటువంటి లోటూ లేకుండా గడిచిపోతుంది. ఇతర శుభ గ్రహాలు కూడా అనుకూల స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారికి ఇతర విషయాల్లో కూడా సంతృప్తి కరంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయా నికి లోటుండదు. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?