దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2024): వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2024): వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Horoscope Today 01st April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 01, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. బంధు మిత్రులు ఎంతో ఆదర భావంతో వ్యవహరిస్తారు. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాలు అభి వృద్ధి బాట పడతాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కాస్తంత ఆచితూచి వ్యవహ రించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొందరు బంధుమిత్రులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, సౌకర్యాలు పెంచుకోవడం జరుగుతుంది. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శించడం, ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం జరుగుతుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యో గులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభదాయకంగా సాగిపో తాయి. ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల వార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

బంధుమిత్రులకు ఆర్థికంగా ఉపయోగపడతారు. శుభ కార్యాల్లో కుటుంబ సమేతంగా పాల్గొం టారు. స్థిరాస్తి వ్యవహారాల పరిష్కారానికి ప్రయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణ వ్యవ హారాల వల్ల ఒత్తిడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ విషయాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక ఉండదు. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకటి రెండు వ్యవహారాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని విధాలు గానూ అనుకూల పరిస్థితులుంటాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. తల్లితండ్రులు లేదా దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. కొందరు సన్నిహిత బంధువులను కలుసుకునే అవకాశ ముంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం విషయంలో అనుకూలతలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఇష్టమైన బంధుమిత్రులను కలు సుకుని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా సంపాదన పెరుగుతుంది. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అవివాహితులు శుభ వార్తలు వింటారు. ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిదానంగా, నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. ప్రయాణాల్లో కూడా బాగా జాగ్రత్తగా ఉండ డం మంచిది. విద్యార్థులు శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా సఫలం అవుతుంది. ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవి తం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగు లకు అవకాశాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి మార్గం సుగమం అవుతుంది.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్