Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృషభ రాశి వారికి రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ప్రస్తుతానికి డబ్బుకు లోటు లేనందువల్ల కొద్దిగా విలాస జీవితం గడిపే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope Today:  ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 02nd April 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృషభ రాశి వారికి రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ప్రస్తుతానికి డబ్బుకు లోటు లేనందువల్ల కొద్దిగా విలాస జీవితం గడిపే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజు మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లోనే కాక, అవసర సమయాల్లో కూడా స్నేహితుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. పిల్లలు విద్యా విషయాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా పని చేయించుకుంటారు. వృత్తి జీవితానికి ఇరవై నాలుగు గంటలు సరిపోదు. రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మొత్తం మీద బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఆర్థిక స్థితిగతులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తు తానికి ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా బాగానే గడిచిపోతుంది. ప్రస్తుతానికి డబ్బుకు లోటు లేనందువల్ల కొద్దిగా విలాస జీవితం గడిపే అవకాశముంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడు కు లున్నప్పటికీ అధికారులు మీ పక్షానే ఉంటారు. పెళ్లి సంబంధం కుదరడంలో కొందరు బంధు వులు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు మిత్రుల ద్వారా ఆదాయ మార్గాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఉండకపోవచ్చు. రాబడికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశివారు అర్ధాష్టమ శని బాధితులు. ప్రతి పనీ ఆలస్యమయి ఇబ్బంది పడతారు. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక, మధ్య మధ్య ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగాల్లో ఒక్కోసారి చాకిరీ తప్పకపోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కానీ, జీతభత్యాలు నిరాశ కలిగిస్తుం టాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చు. ఆదాయానికి లోటుండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

భాగ్య స్థానంలో గురువు ఉన్నంత కాలం ఏ విషయంలోనూ ఇబ్బంది ఉండదు. సప్తమ శని బాధ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కానీ ఉద్యోగంలో పని భారం మాత్రం రెట్టింపవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం ఆర్థికంగా ఇబ్బందులేమీ ఉండకపో వచ్చు. కొద్దిపాటి శ్రమతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ఉద్యోగులు దూర ప్రాంతాల్లో లేక చాలా దూరంలో ఉద్యోగాల్లో చేరవలసి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది కాలం పాటు జీవితం మీరనుకున్నట్టు సాగకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి కానీ, కాస్తంత అసంతృప్తిగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉద్యోగం మారడానికి అవకాశముంది. ఆస్తి వివాదాలు, వివాహ సంబంధమైన వివాదాలు పరిష్కారం కావచ్చు. ప్రతి దానికీ కొద్దో గొప్పో శ్రమపడాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి అనేక విధాలుగా బాగుంటుంది. ఉద్యోగంలో ఎలా పనిచేసినా చెల్లిపోతుంది. అనేక మార్గాల్లో డబ్బు కలిసి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రకరకాలుగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మీ ఆరోగ్యమే కాకుండా ఇంట్లో వారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశివారికి అప్పుడప్పుడూ అర్ధాష్టమ శని బాధ తప్పదు. పైగా రాశ్యధిపతి కుజుడు కూడా శనితో కలిసి ఉన్నందువల్ల అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. డబ్బు వ్యవహారాలు కాస్తంత బలహీనంగా ఉంటాయి. డబ్బులు తీసుకున్నవారు ఒక పట్టాన తిరిగి ఇవ్వరు. రావలసిన బకాయిలు కూడా చేతికి అందవు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మధ్య మధ్య వేధించే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు పెద్దగా పెరగకపోవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి డబ్బుకు లోటేమీ ఉండదు. అయి నప్పటికీ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఉన్నతాధికారులకు మీరెంత చెబితే అంత. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రికార్డులు సృష్టిస్తాయి. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. అటు వివాహ ప్రయత్నాలు, ఇటు ఉద్యోగ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా పని ఎక్కువ ఫలితం తక్కువగా అన్నట్టుగా ఉంటుంది. అధికారులు అవసరానికి మించి పని చేయించుకుంటారు. ఇంటి బాధ్యతలు కూడా కాస్తంత ఎక్కు వగానే ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరిగి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం ఒక్కటే కాస్తంత ఊరటగా ఉంటుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభవార్తలకు ఏమాత్రం లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దూర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులు ఇంటికి రావడం వల్ల కొద్దిగా ఆనందోత్సాహలు పొందుతారు. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పదోన్నతి వచ్చినట్టు, ఇంక్రిమెంట్లు పెరిగినట్టు అధికారులు ఒకటి రెండు మాటలు చెప్పే అవకాశముంది. పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా కొద్దిగా ఆదాయం సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన వర్తమానం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మీ పనితీరును మెరుగుపరచుకుంటారు. నైపుణ్యాలను పెంచుకుంటారు. అధికారు లను వీలైనంతగా ఆకట్టుకుంటారు. డాక్టర్లకు, లాయర్లకు రాబడికి లోటుండదు. ఎంత శ్రమకైనా సిద్ధపడతారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. ఆదాయ ప్రయ త్నాలను ఉధృతం చేస్తారు. ఇంట్లో శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. రావలసిన డబ్బును, బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.