Luck Astrology: వక్రగతి బుధుడితో ఆ రాశుల వారికి కొత్త అదృష్టాలు.. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఆదాయం

మేష రాశిలో సంచారం ప్రారంభించిన బుధుడు ప్రస్తుతం వక్రగతి పట్టడం జరిగింది. ఈ నెల 10 వరకూ ఈ రాశిలో వక్ర సంచారం చేసిన తర్వాత బుధుడు మళ్లీ మీన రాశిలో ప్రవేశించడం జరుగు తుంది. గ్రహం వక్రించినప్పుడు చేష్టాబలం పెరుగుతుంది. అంటే వక్రించిన గ్రహం సత్వర ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Luck Astrology: వక్రగతి బుధుడితో ఆ రాశుల వారికి కొత్త అదృష్టాలు.. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఆదాయం
Luck Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 01, 2024 | 7:17 PM

మేష రాశిలో సంచారం ప్రారంభించిన బుధుడు ప్రస్తుతం వక్రగతి పట్టడం జరిగింది. ఈ నెల 10 వరకూ ఈ రాశిలో వక్ర సంచారం చేసిన తర్వాత బుధుడు మళ్లీ మీన రాశిలో ప్రవేశించడం జరుగు తుంది. గ్రహం వక్రించినప్పుడు చేష్టాబలం పెరుగుతుంది. అంటే వక్రించిన గ్రహం సత్వర ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. చర రాశి అయిన మేష రాశిలో గురువుతో కలిసి ఉన్న బుధ గ్రహం వక్రించడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్పు, మకర రాశుల వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. దీనివల్ల తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఆదాయం కలిసి రావడానికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్లు పెరగడం వంటివి జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న బుధుడు వక్రించడం వల్ల అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా సంపాదించడా నికి ప్రయత్నించడం జరుగుతుంది. అతి వేగంగా నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టే అవకాశ ముంటుంది. ప్రయాణాల వల్ల అనేక వ్యవహారాలు సానుకూలపడడంతో పాటు, ఆర్థిక లాభం కలు గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరు ద్యోగులు తప్పకుండా ఆఫర్లు అందుకుంటారు. అనారోగ్య సమస్యకు అనుకోని పరిష్కారం లభిస్తుంది.
  2. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు లాభ స్థానంలో వక్రించడం వల్ల అతి తక్కువ వృత్తి, వ్యాపారాల్లో లాభాలను పెంచు కోవడం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. షార్ట్ కట్ లేదా ఈజీ మార్గాల ద్వారా రాబడి పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభి స్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. లక్ష్యాలను సాధించడంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో పెండింగు పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. నిలిచిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, జీతభత్యాల పెరుగుదల వంటివి కద లడం ప్రారంభిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అకస్మా త్తుగా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల విషయంలో గతంలో ఆగిపోయిన శుభవార్తలు ఇప్పుడు అందడం జరుగుతుంది.
  4. కన్య: ఈ రాశినాథుడైన బుధుడు అష్టమ స్థానంలో వక్రగతి పట్టినందువల్ల, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సత్వరం పరిష్కారం అయ్యే అవకాశముంటుంది. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక సంబంధ మైన నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఆశించిన ఒప్పందాలు కుదురుతాయి. అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు లభి స్తాయి. చిన్ననాటి స్నేహితులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి పంచమంలో బుధుడి వక్రగతి వల్ల వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయ త్నాలు కూడా చేస్తారు. ఉద్యోగంలో మరింతగా ప్రతిభ కనబరచడానికి, నైపుణ్యాలను ప్రదర్శించ డానికి ప్రయత్నిస్తారు. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
  6. మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న బుధుడు వక్రించడం వల్ల గృహ, వాహన సౌకర్యా లకు సంబంధించిన మీ ప్లాన్లు వేగం పుంజుకుంటాయి. ఆస్తి వ్యవహారాలను, కుటుంబ వ్యవహారా లను చక్కబెడతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమ స్యలను కూడా పరిష్కరిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో అధికారు లకు బాగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాలు అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కు తాయి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..