Punganur Cow: ‘బంగారు’ పాలను ఇస్తున్న బుజ్జి ఆవులు.. చూసేందుకు జనం క్యూ

ఈ ఆవు పాలల్లో అనేక ఔషధాలు ఉన్నాయని అంటున్నారు పశువైద్యులు. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ధర కూడా లక్షల్లో ఉంటుంది. కొంతమంది రైతులు ఈ జాతి ఆవుల సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వీటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం....

Punganur Cow: 'బంగారు' పాలను ఇస్తున్న బుజ్జి ఆవులు..  చూసేందుకు జనం క్యూ
Punganur Dwarf Cattle
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 31, 2024 | 7:38 PM

ఈ బుజ్జి ఆవును చూశారా..? వీటిని పుంగనూరు ఆవులు అంటారు. ఇవి కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పెరుగుతాయి. ఈ ఆవు పాలను తాగితే ఎంతో బలమట. వాటి పాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో.. ఏపీలోని కర్నూల్ ​జిల్లా నుంచి ఒక జత పుంగనూరు జాతి ఆవులు, ఒక ఎద్దును కొన్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన సంజీవ్ ​ఖండేల్వాల్. దీంతో వాటిని చూసేందుకు అతని ఇంటికి స్థానికులు క్యూ కడుతున్నారు. తొలుత అర లీటర్ మాత్రమే పాలు ఇచ్చిన ఈ ఆవులు.. ఇప్పుడు రోజుకు ఒకటిన్నర నుంచి 2 లీటర్ల వరకు ఇస్తున్నాయని సంజీవ్ తెలిపాడు. అంతేకాదు.. ఈ ఆవులు ఇంట్లో ఉంచుకుంటే.. ఎంతో మంచిదట. వాటికి ఉన్న ఔషధ గుణాల నేపథ్యంలో.. ఈ ఆవు పాలను కూడా బంగారు పాలు అంటారని స్థానికంగా చెబుతున్నారు.

సాధారణ ఆవుల్లో వెన్నశాతం 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుంది. కానీ పుంగనూరు జాతి ఆవు పాలల్లో 8 శాతం వరకు వెన్న ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి అభిషేకంలో కూడా ఈ పాలను వాడుతున్నారు. ఈ ఆవు మూత్రాన్ని కూడా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. సంప్రదాయ వైద్యాన్ని పాటించేవారు.. ఈ ఆవు మూత్రాన్ని లీటర్ పది రూపాయలకు, పేడ కిలో ఐదు రూపాయలు లెక్క కొంటున్నారు. దీని మూత్రంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల రైతులు తమ పొలాల్లో పురుగుమందులుగా ఉపయోగిస్తారు.

పుంగనూరు జాతి ఆవుల పొట్టిగా, చూడటానికి ముద్దుగా ఉంటాయి. అవి చూడగానే ఆకర్షిస్తాయి. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా, దూడలా అని తికమకపడుతుంటారు. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ అధికంగా ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో గర్తించడం వల్ల వీటికి ఊరు పేరును పెట్టారు. ఈ ఆవు ధర సుమారు 1 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకోగలవు. కొంతమంది వీటిని పిల్లల్లాగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు. ఈ జాతి ఆవులు ఇప్పుడు వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా గుంటూరులో ఈ బ్రీడ్ ఉత్పత్తిని రెండేళ్ల క్రితం ప్రారంభించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!