AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World cup trophy: వరల్డ్‌ కప్‌ తయరీ వెనక ఇంత పెద్ద కథ ఉందా.? ఆసక్తికర విషయాలు..

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 1975లో ప్రారంభైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. తొలి వరల్డ్‌ కప్‌కు ‘ప్రుడెన్షియల్ వరల్డ్ కప్’ అని నామకరణం చేశారు. ‘ఫ్రుడెన్షియల్’ అనే భీమా కంపెనీ ఈ కప్‌ను స్పాన్సర్‌ చేయడమే దీనికి కారణం. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని వెండి, బంగారంతో రూపొందించారు. లోపల వెండి, పై భాగంంలో బంగారు పూత వేశారు. ఆ తర్వాత 1979, 1983 ప్రపంచకప్...

World cup trophy: వరల్డ్‌ కప్‌ తయరీ వెనక ఇంత పెద్ద కథ ఉందా.? ఆసక్తికర విషయాలు..
World Cup Trophy
Narender Vaitla
|

Updated on: Nov 21, 2023 | 9:16 AM

Share

2023 వరల్డ్‌ కప్‌ ముగిసింది. ఈసారి వరల్డ్‌ కప్‌లో టీమిండియా తొలి నుంచి అద్భుత ఆటతీరును కనబరిచినప్పటికీ, ఫైనల్‌ ఓటమి అందరినీ బాధకు గురి చేసింది. యావత్ దేశం నిరాశలో కూరుకుపోయింది. ఫైనల్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ను ఎగిరేసుకుపోయింది. ఇదిలా ఉంటే నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌ ప్రపంచకప్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు.

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 1975లో ప్రారంభైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. తొలి వరల్డ్‌ కప్‌కు ‘ప్రుడెన్షియల్ వరల్డ్ కప్’ అని నామకరణం చేశారు. ‘ఫ్రుడెన్షియల్’ అనే భీమా కంపెనీ ఈ కప్‌ను స్పాన్సర్‌ చేయడమే దీనికి కారణం. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని వెండి, బంగారంతో రూపొందించారు. లోపల వెండి, పై భాగంంలో బంగారు పూత వేశారు. ఆ తర్వాత 1979, 1983 ప్రపంచకప్ లో కూడా ఇదే బీమా కంపెనీ స్పాన్సర్ చేసింది.

1996 తర్వాత ఐసీసీ కొత్త ట్రోఫీని తయారు చేసింది. ట్రోఫీ తయారీ బాధ్యతను లండన్ లోని ‘గారార్డ్’ అనే జ్యువెల్లరీ సంస్థకు అప్పగించింది. వెండితో తయారు చేసే ట్రోఫీపై బంగారు పూత పూస్తారు, ఈ ట్రోఫీ తయారీకి రెండు నెలల సమయం పడుతుంది. వరల్డ్‌ కప్‌ ట్రోఫీ 60 సెంటీమీటర్లు ఎత్తు ఉంటుంది. ట్రోఫీపైన బంగారు రంగులో గ్లోబ్‌ ఉంటుంది. ఈ గ్లోబ్‌కు సపోర్ట్‌గా మూడు సిల్వర్‌ కాలమ్స్‌ ఉంటాయి. ఇవి స్టంప్‌లు, బెయిల్స్‌ ఆకారంలో నిలువు వరుసలో ఉంటాయి. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌కు గుర్తుగా.. గుండ్రంగా ఉన్న గ్లోబ్‌ క్రికెట్‌ బంతిని సూచిస్తుంది. ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకేలా ఉండడం ప్రత్యేకత. ఈ ట్రోఫీ 11 కిలోల వరకు బరువు ఉంటుంది.

ఇదిలా ఉంటే వరల్డ్‌ కప్ ట్రోఫీ తయారీకి సుమారు రూ. 31 లక్షలు ఖర్చు అవుతుంది. ట్రోఫీని గెలుచుకున్న జట్టు పేరును ట్రోఫీ కింది భాగంలో ముద్రిస్తారు. గెలిచిన జట్టుకు ట్రోఫికి సంబంధించిన నకలును మాత్రమే అందిస్తారు. అసలు ట్రోఫీని ఐసీసీ దుబాయ్‌లోని కార్యాలయంలో ఉంచుతుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..