AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగు పాముల తలపై నిజంగానే నాగమణి ఉంటుందా..? ఈ వింత సంగతులు తెలిస్తే..

అంతేకాదు.. పాములు తమ ఆహారాన్ని నమలలేవు. కొరకలేవు. అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగేస్తాయని చెబుతున్నారు. తమ తలకంటే పెద్ద పరిమాణంలో ఉన్న జంతువులను కూడా పాములు మింగేయగలవని చెబుతున్నారు. వీటి దవడల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుందట. అంతేగానీ, పాములు పాలు తాగవంటున్నారు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదని చెబుతున్నారు.

నాగు పాముల తలపై నిజంగానే నాగమణి ఉంటుందా..? ఈ వింత సంగతులు తెలిస్తే..
Nagamani
Jyothi Gadda
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 07, 2024 | 5:45 PM

Share

పాములంటే.. దాదాపు అందరూ భయంతో పారిపోతారు. ఇక నాగుపాముని చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ, నాగుపాము తల పై నాగమణి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అది కనిపిస్తే ప్రాణాలకు తెగించి అయినా సరే.. దానిని సొంతం చేసుకోవాలని కూడా ప్రచారంలో ఉంది. నాగమణి దక్కిన వారికి ప్రాణాపాయం ఉండదని, వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని కూడా చాలా మంది నమ్ముతుంటారు. చాలా సినిమాల్లో చూపించినట్టుగా నాగు పాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి నిజంగానే నాగు పాము తలపై ఉంటుందా..? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా..? లేకపోతే నాగమణి గురించి అంత కట్టుకథ లేనా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

పాములు పాలు తాగుతాయి: పాములు పాలు తాగుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగా, నాగ పంచమి రోజున పుట్టల వద్ద ప్రజలు బారులు తీరి మరీ పాములకు పాలు పోస్తుంటారు. అయితే పాములు పాలను ఇష్టంగా తాగవని నిపుణులు చెబుతున్నారు. బలవంతంగా తాగుతాయట. వాస్తవానికి నాగ పంచమికి ముందు పాములను ఆకలితో, దాహంతో ఉంచుతారు. అందుకే నాగపంచమి రోజున పాముకి పాలు పోస్తే అది తాగడం ప్రారంభిస్తుంది. వాస్తవానికి, పాములు చల్లని-బ్లడెడ్ జంతువులు, అటువంటి పరిస్థితిలో వాటికి పాలు పోయడం వాటి ఆరోగ్యానికి హాని కలిగించినట్లే అంటున్నారు నిపుణులు.

పాములు ప్రతీకారం తీర్చుకుంటాయి : పాముల గురించి మరొక పెద్ద అపోహ ఏమిటంటే పాములు పగబడతాయని, అవి ప్రతీకారం తీర్చుకుంటాయని చెబుతుంటారు. కానీ పాములు ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేవని చెబుతున్నారు. నిజానికి చాలా వరకూ పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. మనుషులను గుర్తుపెట్టుకుని దాడిచేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదని అంటున్నారు. ఒక వ్యక్తిపై పాములు పలు మార్లు దాడి చేసి కాటువేయడం యాధృచ్ఛికమే కావచ్చు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నాగమణి అన్నది ఎంతవరకు వాస్తవం: చాలా బాలీవుడ్ సినిమాలు నాగమణి ఉన్నట్టుందని, దాని ప్రభావాన్ని చూపించాయి. నాగుడికి నాగమణి ఉందని, అది ఎవరినైనా నియంత్రించగలదని చెబుతారు. కానీ, అది వాస్తవం కాదంటున్నారు నిపుణులు. పౌరాణిక వాస్తవాల ప్రకారం ఇది నిజమని భావించినప్పటికీ, సైన్స్ కోణలో ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. నాగమణిపై అత్యాశతో చాలా పాముల ప్రాణాలు బలిచేశారని, కానీ, ఇప్పటి వరకు ఒక్క పాములో కూడా కనిపించలేదని చెబుతున్నారు. నాగమణి నాగుపాము తలలో ఉంటుందనేది కేవలం మూఢనమ్మకమే అంటున్నారు నిపుణులు.

అంతేకాదు.. పాములు తమ ఆహారాన్ని నమలలేవు. కొరకలేవు. అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగేస్తాయని చెబుతున్నారు. తమ తలకంటే పెద్ద పరిమాణంలో ఉన్న జంతువులను కూడా పాములు మింగేయగలవని చెబుతున్నారు. వీటి దవడల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుందట. అంతేగానీ, పాములు పాలు తాగవంటున్నారు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..