Health Tips: మీరు రోజంతా వేడి నీళ్లే తాగుతున్నారా..? ఇంతకంటే ప్రమాదం మరొకటి లేదు..! జాగ్రత్త

అదే పనిగా వేడి నీరు తాగితే అది ప్రేగులను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు, వేడినీరు తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వేడినీరు తాగడం నోటిపూతలకు కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి వేడినీళ్లు తాగే అలవాటు ఉన్నవారు మరికొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.

Health Tips: మీరు రోజంతా వేడి నీళ్లే తాగుతున్నారా..? ఇంతకంటే ప్రమాదం మరొకటి లేదు..! జాగ్రత్త
Hot Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2024 | 4:16 PM

మానవ జీవితంలో నీరు ఒక ముఖ్యమైన భాగం. నీరు లేకుండా జీవించడం కష్టం. ఈ రోజుల్లో రోగాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ప్రజలు అనేక రకాలైన వ్యాధులకు గురవుతారు. అయితే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు నయమవుతాయని పరిశోధకులు నిరూపించారు. అయితే, రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. రోజంతా వేడినీళ్లు తాగితే కొన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వేడినీరు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

నీరు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగాలి. వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే వేడి నీటిని ఎక్కువగా తాగితే కాలేయం పాడవుతుందని కొందరు అంటున్నారు. చాలా మంది వేడినీరు తాగరు. ఎందుకంటే ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. కానీ నిజానికి వేడి నీరు కాలేయానికి హాని కలిగించదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి నీరు కాలేయానికి హాని కలిగించదు. బదులుగా వేడి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆరోగ్యానికి మంచిది. వేడినీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా వేడి నీరు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టి లావుగా ఉన్నవారు వేడినీళ్లు తాగడం మంచిది. ఓవరాల్‌గా వేడి నీళ్ల వల్ల కాలేయ సమస్యలు వస్తాయన్నది నిజం కాదు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంపై వేడి నీటి దుష్ప్రభావాలు: వేడినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు ప్రత్యేక కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయని, ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అయితే, వేడి నీళ్ల వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా వేడి నీరు తాగే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఎక్కువగా పని చేయడం వల్ల, పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల గొంతు మంట వస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల విపరీతమైన చెమట పడుతుంది. దీని వల్ల చెమట, దురద, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అదే పనిగా వేడి నీరు తాగితే అది ప్రేగులను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు, వేడినీరు తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వేడినీరు తాగడం నోటిపూతలకు కారణమవుతుందని చెబుతున్నారు. నిజానికి వేడినీరు తాగడం వల్ల ఎలాంటి రోగాలు నయం కావు. కాబట్టి వేడినీళ్లు తాగే అలవాటు ఉన్నవారు మరికొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?