వర్షాకాలంలో వ్యాధులకు చెక్ పెట్టే ఛూమంత్రం.. బెల్లం, మిరియాలతో ఇలా చేశారంటే..

వర్షాకాలంలో అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వైరల్ జ్వరం, జలుబు-దగ్గు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

వర్షాకాలంలో వ్యాధులకు చెక్ పెట్టే ఛూమంత్రం.. బెల్లం, మిరియాలతో ఇలా చేశారంటే..
Monsoon Health Tips
Follow us

|

Updated on: Aug 07, 2024 | 3:52 PM

వర్షాకాలంలో అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వైరల్ జ్వరం, జలుబు-దగ్గు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మిరియాలు, బెల్లం కలిపి తింటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బెల్లం, మిరియాలు వేడిగా ప్రభావం ఉండటం వల్ల అనేక తీవ్రమైన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతాయి.

బెల్లం, మిరియాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకోండి..

  1. జలుబు – దగ్గు: మిరియాలు, బెల్లం కలిపి తింటే జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక బెల్లం ముక్క, చిటికెడు ఎండుమిరియాల పొడి కలిపి తాగితే కొద్దిరోజుల్లో ఉపశమనం కలుగుతుంది.
  2. గొంతు నొప్పి నుంచి ఉపశమనం: వర్షాకాలంలో గొంతునొప్పి మరింత తీవ్రమవుతుంది. కాబట్టి బెల్లం, మిరియాలు చాలా సహాయకారంగా ఉంటాయి. దీనికి 50 గ్రాముల బెల్లం పొడి, 20 గ్రాముల మిరియాల పొడిని కలిపి, ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  3. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: బెల్లంలో ఉండే మంచి కాల్షియం, ఫాస్పరస్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. నల్ల మిరియాలులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, ఇందులో ఉండే పైపెరిన్ కీళ్ల నొప్పుల రోగులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
  4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బెల్లం, నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వినియోగం హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిని కూడా పెంచుతుంది. బెల్లం, మిరియాలు కలయిక కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రిస్తుంది.
  5. ఒత్తిడిని తగ్గిస్తుంది: బెల్లం, నల్ల మిరియాలు ఒత్తిడి, ఆందోళన చెందుతున్న వారికి సహాయపడతాయి. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడే సెరోటోనిన్‌ని పెంచుతుంది. చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.
  6. పీరియడ్స్ లో నొప్పి తిమ్మిరి నుంచి ఉపశమనం: చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో శరీర నొప్పులను అనుభవిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం, మిరియాలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా తినలేకపోతే.. టీలో బెల్లం, మిరియాలు వేసి తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సినిమా ప్రమోషన్లలో వింత ప్రశ్నలు.. తడబడుతున్న సెలబ్రిటీలు
సినిమా ప్రమోషన్లలో వింత ప్రశ్నలు.. తడబడుతున్న సెలబ్రిటీలు
పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సాయి పల్లవి.. రష్మిక..
పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సాయి పల్లవి.. రష్మిక..
'నా దేవుడిని కలిశాను'.. ఎమోషనలైన హీరో రిషబ్‌ శెట్టి..ఫొటోస్ ఇదిగో
'నా దేవుడిని కలిశాను'.. ఎమోషనలైన హీరో రిషబ్‌ శెట్టి..ఫొటోస్ ఇదిగో
కేరళ చీరలో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
కేరళ చీరలో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
పది నిమిషాల్లోనే మీ చేతుల్లోకి ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్
పది నిమిషాల్లోనే మీ చేతుల్లోకి ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్
డార్క్ సర్కిల్స్‌ని పర్మినెంట్‌గా ఎలా దూరం చేయాలనుకుంటున్నారా..?
డార్క్ సర్కిల్స్‌ని పర్మినెంట్‌గా ఎలా దూరం చేయాలనుకుంటున్నారా..?
భూమిపై ఆరు ఖండాలేనా..? సంచలన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి
భూమిపై ఆరు ఖండాలేనా..? సంచలన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి
బెండకాయ తింటే డయాబెటిస్ మాయం..! కావాలంటే మీరు ఇలా ట్రై చేయండి!
బెండకాయ తింటే డయాబెటిస్ మాయం..! కావాలంటే మీరు ఇలా ట్రై చేయండి!
లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోయే టేస్టీ కొబ్బరి రైస్..
లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోయే టేస్టీ కొబ్బరి రైస్..
'పతకం ముఖ్యం కాదు'.. వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు
'పతకం ముఖ్యం కాదు'.. వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు