Lord Shani Dev: అతి వక్రంలో శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
ప్రస్తుతం తన స్వస్థానమైన కుంభ రాశిలో వక్రించి ఉన్న శనీశ్వరుడు క్రమంగా అతి వక్రంలోకి మారుతున్నాడు. సాధారణంగా మందగమనంతో వ్యవహరించే శనీశ్వరుడు ఈ అతి వక్రం వల్ల అతి వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల శనికి చేష్టాబలం ఏర్పడుతుంది. ఇవ్వాల్సిన శుభ ఫలితాలను సత్వరం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం తన స్వస్థానమైన కుంభ రాశిలో వక్రించి ఉన్న శనీశ్వరుడు క్రమంగా అతి వక్రంలోకి మారుతున్నాడు. సాధారణంగా మందగమనంతో వ్యవహరించే శనీశ్వరుడు ఈ అతి వక్రం వల్ల అతి వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల శనికి చేష్టాబలం ఏర్పడుతుంది. ఇవ్వాల్సిన శుభ ఫలితాలను సత్వరం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ అతి వక్రం వల్ల శనీశ్వరుడు మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలు కలిగించే సూచనలున్నాయి. ఈ అతి వక్ర స్థితి నవంబర్ 15 వరకూ కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశికి పదకొండవ స్థానంలో, అంటే లాభ స్థానంలో ఉన్న శని అతిగా వక్రిస్తున్నందువల్ల తప్ప కుండా ఉద్యోగమూలక ధన లాభం, ఉద్యోగంలో పదోన్నతి వంటివి సంభవిస్తాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. కుటుంబంలో జరగవలసిన శుభ కార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. మంచి ఉద్యోగంలోకి మార డానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.
- వృషభం: ఈ రాశికి పదవ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడు అతివక్రం పట్టినందువల్ల ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. పని భారం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభం అవుతుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శని అతి వక్రం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
- తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానంలో వక్రించినందువల్ల కలలో కూడా ఊహించని విధంగా ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదాతో పాటు, జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మనసులోకి కోరికలు నెరవేరుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అతి వక్రం చెందినందువల్ల, ఆదా యం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ఏ రంగానికి చెందినవారికైనా పురోగతి ఉంటుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవ కాశం కూడా ఉంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగి, సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి రాశ్యధిపతి, ధనాధిపతి అయిన శనీశ్వరుడు అతిగా వక్రించినందువల్ల ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, ఆదాయం దిన దినాభివృద్ధి చెందడం, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనడం వంటివి జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యా లకు అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.