Munaga Chettu : ఇంటి ఆవరణలో మునగ చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
హిందూ మతంలో ప్రతి ఇంటికి వాస్తు తప్పనిసరి. అలాగే, ఇంట్లోని వస్తువులు, ఇంటి ఆవరణలోని చెట్లు, మొక్కలకు కూడా వాస్తు తప్పనిసరి అంటున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం కొన్ని చెట్లను ఇంటి ఆవరణలో పెంచరాదని చెబుతున్నారు. మరికొన్ని చెట్లను దిక్కులను అనుసరించి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలో మునగ చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..?

మునగ చెట్టు ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా ఎంతో విలువైనదని మనందరికి తెలుసు.. ఆకులు, కాయలు, పువ్వులు, గింజలు ఆరోగ్య పరంగా దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి రక్తహీనత, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి, తక్కువ నీటితో పెరుగుతుంది.
కొందరు వాస్తు నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మునగ చెట్టు ఇంటి గుమ్మం ఎదురుగా ఉండకూడదని చెబుతున్నారు. ఇంటి గుమ్మం ఎదురుగా చెట్టు ఉండటం వల్ల శక్తి ప్రవాహానికి అడ్డంకిగా మారుతుందని భావిస్తారు. ఇంటిలోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి చెట్టు అడ్డుగా నిలుస్తుందని నమ్ముతారు. ఈ మునగ చెట్టు ఔషధ గుణాలున్న చెట్టు కాబట్టి సానుకూలతను ఇస్తుందని కూడా కొందరు భావిస్తారు.
అయితే దీని వేర్లు ఇంటి ఫౌండేషన్‌కి హాని కలిగించవచ్చట. వాస్తు ప్రకారం దక్షిణం లేదా పశ్చిమ దిశలో నాటడం శుభప్రదమని, ఉత్తరం–ఈశాన్యం దిశలో నాటకూడదని పంచాంగ నిపుణులు బెబుతున్నారు.
NOTE: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








