మీకు తెలుసా..? మన శరీరంలో ప్రతి 60 రోజులకు మారే భాగం ఏంటో..!
మనిషి శరీరం చాలా అద్భుతమైనది. మనం ఎత్తు పెరుగుతున్నప్పుడు శరీరంలోని ఇతర అవయవాలు ఒకేలా ఉన్నట్లు అనిపించినా.. కొన్ని భాగాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఉదాహరణకు.. మన చర్మం ప్రతి 27 రోజులకు కొత్తగా తయారవుతుంది. అలాగే కొన్ని అంతర్గత అవయవాల కణాలు కూడా కొత్తగా వస్తుంటాయి. అయితే మన శరీరంలో ఒక భాగం మాత్రం ప్రతి రెండు నెలలకు పూర్తిగా కొత్తగా పెరుగుతుందని మీకు తెలుసా..?

చాలా మందికి ఈ విషయం తెలియదు. సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ శరీర భాగాలు ఒక స్థాయి వరకు పెరిగి ఆ తర్వాత స్థిరంగా ఉంటాయి. మనిషి రంగు, ఆకృతి వేరుగా ఉన్నా.. శరీర నిర్మాణం మాత్రం ఒకేలా ఉంటుంది. అందరికీ రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్ళు, ఒక ముక్కు వంటి భాగాలు ఉంటాయి. కానీ మన ముఖంలో ఒక భాగం మాత్రం ప్రతి 60 రోజులకు పూర్తిగా మారిపోతుంది.
అది ఏంటో తెలుసా..? మన కనుబొమ్మలు.
కనుబొమ్మ వెంట్రుకలు సుమారు రెండు నెలల పాటు పెరుగుతాయి. ఆ తర్వాత అవి రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందుకే మనం కనుబొమ్మలు శుభ్రం చేసుకున్నా.. అవి మళ్లీ పెరిగి సాధారణ స్థితికి వస్తాయి.
ఈ ఆసక్తికరమైన విషయం మన శరీరం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. ఈ మార్పులన్నీ మనకు తెలియకుండానే జరుగుతాయి. కానీ అవి మన శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి చాలా అవసరం.




