AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో పని మనిషి పంపిన లీవ్‌ లెటర్‌కు.. సోషల్ మీడియా షేక్‌ అవుతోందిగా..

మన ఇంట్లో పనిమనుషులు దాదాపుగా ఎప్పుడూ చెప్పకుండానే సెలవు తీసుకుంటారు. రోజు మాదిరిగానే వస్తారని మనం వారి కోసం ఎదురు చూస్తుంటాం. కానీ ఆమె రాకపోతే, ఆంటీ ఈరోజు సెలవులో ఉందని అర్థం చేసుకోవాలి.. కానీ, బెంగళూరులోని ఒక మహిళ వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన పనిమనిషి ఎంత వృత్తిపరంగా సెలవు అడుగుతుందో చూపిస్తుంది. అంతేకాదు..ఇంగ్లీషులో మెసేజ్ చేసి మరీ ఆమె సెలవు అడిగిన తీరు సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతోంది.

వామ్మో పని మనిషి పంపిన లీవ్‌ లెటర్‌కు.. సోషల్ మీడియా షేక్‌ అవుతోందిగా..
Sick Leave
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2025 | 6:08 PM

Share

బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన పనిమనిషి సెలవు అడిగే విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. దీనిలో పనిమనిషి ఇంగ్లీషులో సెలవు కోరుతూ మెసేజ్ పంపుతుంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన ఇంటి పనిమనిషి ఎంత వృత్తిపరంగా సెలవు తీసుకోవాలని మెసేజ్‌ పంపుతుందో సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు.. ఈ పోస్ట్ చూసి, చాలా మంది నవ్వుకుంటున్నారు. దానికి ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సినప్పుడు తాను చాలా స్పష్టమైన, ప్రొఫెషనల్ ఇంగ్లీషులో మెసేజ్‌ పంపుతానని ఆ మహిళ రాసింది. తన పనిమనిషి తాను ఆఫీసులో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని కూడా ఆమె చెప్పింది.

పనిమనిషి రాసిన మెసేజ్‌ ఆమె 10 ఏళ్ల కుమార్తె టైప్ చేసిందని, ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తుంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని ఆ మహిళ చెప్పింది. ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్‌ చేసింది. అందులో ‘నాకు బాగాలేదు. నాకు జలుబు, గొంతు నొప్పి ఉంది. కాబట్టి, నేను ఈ రోజు పనికి రావటం లేదు’ అని ఇంగ్లీషులో రాసి ఉంది.

House Help Sick Leave

ఇవి కూడా చదవండి

ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌పై చాలా మంది స్పందించారు. చాలా మంది ఈ పోస్ట్‌ను లైక్ చేసి, తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. మన దేశంలో పనిమనిషి ఎవరికీ తెలియజేయకుండా సెలవు తీసుకుంటారు. అప్పుడు పనిమనిషి రాలేదని, అందుకే నేను ఆలస్యం అయ్యానని మనం ఆఫీసులో బాస్‌కి వివరణ ఇచ్చుకోవాలి అంటూ ఒకరు రాశారు. మరొకరు సరదాగా, ‘నేను ఆఫీసులో సెలవు తీసుకున్నప్పుడు, కారణం కూడా చెప్పను, ఈ పనిమనిషి నాకంటే ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

  • Beta

Beta feature

Follow Us
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి.. కేంద్రం కీలక సూచనలు..
అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి.. కేంద్రం కీలక సూచనలు..
రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మహిళ! అదృష్టం అంటే ఇదేనేమో!
రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మహిళ! అదృష్టం అంటే ఇదేనేమో!