ఇదేం ట్రిప్‌రా సామీ.. బట్టలు లేకుండా ప్రయాణించే క్రూజ్ టూర్..! కండీషన్స్ అప్లై..
ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి మనకు తెలియదు. వాటిలో ఒకటి నగ్న ఓడ. అవును, ఇప్పుడు బట్టలు ధరించాల్సిన అవసరం లేని ఒక ఓడ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అవును బట్టలు లేకుండా సెలవులు గడపడానికి ఇష్టపడే ట్రావెల్ లవర్స్ బేర్ నెసెసిటీస్‌తో తమ జీవితాన్ని స్వేచ్ఛగా గడపవచ్చు. బేర్ నెసెసిటీస్ అనేది క్రూయిజ్‌లలో బట్టలు లేని వ్యక్తులకు ప్రయాణాన్ని ఏర్పాటు చేసే పర్యాటక సంస్థ.

సముద్ర ప్రయాణం అంటే ఇష్టపడే వారికి బట్టలు ధరించడం నిషేధించబడిన క్రూయిజ్ ఉందని కూడా తెలియకపోవచ్చు. ఈ రోజుల్లో, అలాంటి ఓడ గురించి చాలా చర్చ జరుగుతోంది. నివేదిక ప్రకారం, ఈ కంపెనీ దుస్తులు ధరించడం నిషేధించబడిన క్రూయిజ్ ట్రిప్‌లను నిర్వహిస్తుంది. కానీ, దీని కోసం కొన్ని నియమాలు, నిబంధనలు కూడా చేయబడ్డాయి. క్రీడలు, వినోదం, స్విమ్మింగ్ సమయంలో ఇక్కడ బట్టలు లేకుండా ఉండటంలో ఎటువంటి సమస్య లేదు. కానీ, విందులు, భోజనాల సమయంలో మీ ప్రైవేట్ భాగాలను కవర్ చేయడం అవసరం.
బేర్ నెసెసిటీస్ తన దుస్తులు లేని క్రూయిజ్‌లకు అనైతికతతో సంబంధం లేదని స్పష్టం చేస్తుంది. అయితే, ఇక్కడ ఇతరుల శరీరాన్ని అనుచితంగా తాకడం ఇక్కడ నిషేధం. బహిరంగ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, అలాంటి కార్యకలాపాలను కోరడం కూడా ఈ ఓడలో నిషేధించబడింది. దీంతో పాటు, ఓడ పూల్, డ్యాన్స్ హాల్ చుట్టూ అనేక నో ఫోటో జోన్లు కూడా ఉన్నాయి. బట్టలు లేకుండా సముద్ర క్రూజ్‌ను ఆస్వాదించే వ్యక్తులు ఇక్కడ ఫోటోలు తీయడం కూడా నిషేధం.
ఓడలోని తినుబండారాల ముందు స్పష్టంగా రాసి ఉంటుంది.. ఈ ప్రదేశాలన్నింటిలోనూ సాధారణ దుస్తులు ధరించడం తప్పనిసరి. డైనింగ్ రూమ్‌లో బాత్‌రోబ్‌లు ధరించడానికి అనుమతి లేదు. అయితే, భోజన సమయంలో ఎవరికి వారుగా ఆహారం వడ్డించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ దుస్తులు ధరించటం తప్పనిసరి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




