ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో వచ్చిన డిజిటల్ వెడ్డింగ్ కార్డు.. ఓపెన్ చేయగానే బ్యాంక్ ఖాతాలో డబ్బు మాయం..!
ఒక ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటిదే జరిగింది. బాధితుడికి తెలియని నంబర్ నుండి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో అతన్ని ఆగస్టు 30, 2025న జరగనున్న వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మెసేజ్ సాధారణ వివాహ ఆహ్వానం లాగా కనిపించింది. కానీ మెసేజ్ ఓపెన్ చేయటం అతనికి అతిపెద్ద ముప్పుగా మారింది.

ఆధునిక టేక్నాలజీని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు ప్రజలను దోచుకోవడానికి కొత్త ఉపాయాలతో వస్తున్నారు. మర్చిపోయి మీ మొబైల్ ఫోన్‌కి వచ్చిన ఏదైనా OTP లేదా ఏదైనా తప్పుడు లింక్‌పై క్లిక్ చేయడం వల్ల చాలా మంది నిలువు దోపిడీకి గురవుతున్నారు. మొబైల్‌ఫోన్‌కి ఏదైనా లింక్డ్ ఫైల్ వచ్చినప్పుడు దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. మీ ఖాతా వివరాలు పూర్తిగా స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఆ మరుక్షణంలోనే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇలాంటి మోసలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి లక్షలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని ఒక ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటిదే జరిగింది. బాధితుడికి తెలియని నంబర్ నుండి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో అతన్ని ఆగస్టు 30, 2025న జరగనున్న వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మెసేజ్ సాధారణ వివాహ ఆహ్వానం లాగా కనిపించింది. కానీ మెసేజ్ ఓపెన్ చేయటం అతనికి అతిపెద్ద ముప్పుగా మారింది. మా పెళ్లికి రండి అంటూ క్యూఆర్ కోడ్ ఉన్న లింక్‌ను పంపించారు. అయితే, ఆ లింక్‌ను ఓపెన్ చేయగా.. బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.2 లక్షలు మాయం అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ ఆ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ ఆ వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్. ఉద్యోగి ఆ ఫైల్‌పై క్లిక్ చేసిన వెంటనే, సైబర్ నేరస్థులు అతని మొబైల్ ఫోన్‌ను యాక్సెస్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతని ఖాతా నుండి రూ.1.9 లక్షలు డ్రా అయిపోయాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




