షాపింగ్ కోసం వెళ్లిన మహిళ.. హఠాత్తుగా కురిసిన వర్షంతో కోటీశ్వరాలైంది..!
ఒక మనిషి క్షణాల్లో కోటీశ్వరుడు అయ్యాడని చెబితే మీరు నమ్ముతారా..? అదేదో సినిమా కథ అనుకుంటారు..కానీ, ఒక మహిళకు సరిగ్గా అలాంటి అదృష్టమే వరించింది. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చేందుకు గానూ మార్కెట్ బయల్దేరిన ఓ మహిళ మార్గమధ్యలోనే ఊహించని విధంగా కోటీశ్వరాలిగా మారిపోయింది. ఆ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్ వర్షం పడింది. దాంతో ఆమె ఆ పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి ఆగింది.. వర్షం తగ్గేంతవరకు అక్కడే ఉండి ఆ తరువాత బయల్దేరింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె కలలో కూడా ఊహించని అదృష్టం బహుమతిగా లభించింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

మీరు అదృష్టాన్ని నమ్ముతారా..? నమ్మకపోతే, ఈ సంఘటన తెలిసిన తర్వాత ఖచ్చితంగా అదృష్టం అంటే ఇదే అంటారు. చైనాకు చెందిన ఒక మహిళ సరుకులు కొనడానికి మార్కెట్‌కు వెళ్ళింది. ఆమె మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా, అకస్మాత్తుగా వర్షం పడటం ప్రారంభమైంది. దాంతో ఆమె వెంటనే వర్షంలో తడవకుండా ఉండేందుకు గానూ ఆ పక్కనే ఉన్న ఒక దుకాణానికి వెళ్ళింది. అది ఒక లాటరీ షాప్.. వర్షం తగ్గేంత వరకు అక్కడే ఉన్న ఆమె.. టైమ్ పాస్ కోసం ఒక లాటరీ టికెట్ కొనుక్కుంది. అదే టికెట్ ఆమెకు కాసుల పంటగా మారింది. ఈ ఘటన ఆగస్టు 8న జరిగింది.
నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని యుక్సీలో ఉంటున్న ఒక మహిళ వర్షంలో చిక్కుకుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఆమె సమీపంలోని లాటరీ దుకాణానికి వెళ్ళింది. అక్కడ ఆమె దుకాణదారుడిని అడిగింది.. మీ దగ్గర స్క్రాచ్ కార్డులు ఉన్నాయా..? వర్షం తగ్గే వరకు నేను కొంచెం ఆడుకుంటాను అని చెప్పింది.
అలా ఆమె దాదాపు 30 టిక్కెట్లు ఉన్న ఒక మొత్తం బుక్‌లెట్‌ను కొనుగోలు చేసింది. ఒక్కో టికెట్ ధర 30 యువాన్లు (సుమారు రూ. 250). అంటే ఆమె టిక్కెట్ల కోసం మొత్తం 900 యువాన్లు (సుమారు రూ. 12,500) ఖర్చు చేసింది. కానీ ఆమె ఆరవ టికెట్‌ను స్క్రాచ్ చేయగానే, ఆమె అదృష్టం ప్రకాశించింది. ఆ టికెట్‌పై ఆమె 10 లక్షల యువాన్లు (సుమారు రూ. 1.4 కోట్లు లేదా US$ 140,000) బహుమతిని గెలుచుకుంది. ఊహించని విధంగా ఆమె పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకున్నందుకు చాలా ఆశ్చర్యపోయింది. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదంటూ ఆనందంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




